E-Paper
Advertisement

Virat Kohli: టెస్ట్ క్రికెట్‌లో 12 ఏళ్లు పూర్తి.. కోహ్లీ పోస్ట్…

Virat Kohli: టెస్ట్ క్రికెట్‌లో 12 ఏళ్లు పూర్తి.. కోహ్లీ పోస్ట్…
Advertisement

Virat Kohli: క్రికెట్‌లో ఒక్కొక్క ఫార్మాట్‌కు ఒక్కొక్క విధమైన క్రేజ్ ఉంటుంది. మామూలుగా ప్రేక్షకులకు ఐపీఎల్ లాంటి ఫార్మాట్స్ అంటే ఎక్కువ ఇష్టం. అదే విధంగా మెల్లగా సాగే టెస్ట్ మ్యాచ్‌లకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. క్రికెట్‌లోని అసలైన మజా చూడాలంటే టెస్ట్‌లలోనే ఉంటుందని అంటుంటారు. అందుకే చాలామంది క్రికెటర్లకు కూడా టెస్ట్‌లలో ఆడాలనే కోరిక ఉంటుంది. ఇక తాజాగా విరాట్ కోహ్లీ.. టెస్ట్‌లలోకి ఎంటర్ అయ్యి 12 ఏళ్లు అయిన సందర్భంగా సంతోషంగా పోస్ట్ పెట్టాడు.

2011 జూన్ 20న విరాట్ కోహ్లీ తన టెస్ట్ డబ్యూ చేశాడు. తన మొదటి టెస్ట్ జమైకాలోని కింగ్‌స్టన్‌లో వెస్ట్ ఇండీస్‌కు పోటీగా ఆడాడు. ఇప్పటివరకు కోహ్లీ.. 109 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి చేశాడు. అందులో మొత్తంగా 28 సెంచరీలతో అదరగొట్టాడు. కానీ విరాట్.. తన మొదటి మ్యాచ్‌లో మాత్రం సరిగ్గా ఆట కనబరచలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లో కేవలం 4,15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌లో పేసర్ ఫీడెల్ ఎడ్వార్డ్స్ చేతిలోనే ఓడిపోయాడు.

మొదటి టెస్ట్‌లో విరాట్ కోహ్లీ ఆటను చూసిన ప్రేక్షకులు.. తను ఈ స్థాయికి ఎదుగుతారని ఊహించకపోయి ఉండవచ్చు. క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. ఒక్కసారిగా ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ.. కొన్ని సంవత్సరాల పాటు కష్టంగా కెరీర్‌ను కొనసాగించాడు. మళ్లీ కోహ్లీ ఎప్పుడెప్పుడు ఫార్మ్‌లోకి వస్తాడా అని ఎదురుచూసిన ప్రేక్షకుల కోసం తాజాగా జరిగిన ఐపీఎల్‌లో సెంచరీ కొట్టి చూపించాడు. ఇక తను టెస్ట్ మ్యాచ్‌లో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘టెస్ట్ క్రికెట్‌లో 12 ఏళ్లు. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని తన ఫోటోతో ట్వీట్ చేశాడు కోహ్లీ.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×