E-Paper
Advertisement

మొన్న హెడ్, ఇప్పుడు గిల్…మ‌రో వివాదంలో విరాట్ కోహ్లీ, చేతుల‌తో అస‌భ్య‌క‌ర సైగ‌లు చేస్తూ

మొన్న హెడ్, ఇప్పుడు గిల్…మ‌రో వివాదంలో విరాట్ కోహ్లీ, చేతుల‌తో అస‌భ్య‌క‌ర సైగ‌లు చేస్తూ
Advertisement

RCB VS GT:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో విరాట్ కోహ్లీ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ డేంజర్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అతన్ని అవమానించాడు. ఈ ఘటన ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది మరవక ముందే విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Royal Challengers Bengaluru vs Gujarat Titans) మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ మంగళవారం జరిగింది. అయితే ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ ( Shubman Gill), ఇతర ప్లేయర్లను టీజింగ్ చేస్తూ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) కనిపించాడు. ముఖ్యంగా గిల్ ను ఉద్దేశించి చేతులతో అసభ్యకరమైన సైగలు చేశాడు విరాట్ కోహ్లీ. ఈ సంఘటన వైరల్ అయిన నేపథ్యంలో.. మళ్లీ విరాట్ కోహ్లీని దారుణంగా ఆడుకుంటున్నారు జనాలు. ఇంత జరిగిన కూడా విరాట్ కోహ్లీకి బుద్ధి రావడం లేదంటూ మండిపడుతున్నారు.

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

మొన్న హెడ్, ఇప్పుడు గిల్…మ‌రో వివాదంలో విరాట్ కోహ్లీ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ క్వాలిఫైయర్ 1 లో భాగంగా బెంగుళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి గుజరాత్ బౌలింగ్ చేయగా… బెంగళూరు మాత్రం బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వెళ్లే ముందు విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ప్రవర్తించాడు. గిల్ ను ఉద్దేశించి చేతులతో అసభ్యకరమైన సైగలు చేశాడు విరాట్ కోహ్లీ. గిల్ ను ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన గిల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న హెడ్ ను గెలికావ్? దీంతో అందరూ నిన్ను వెధవను చేస్తూ ఆడుకున్నారు… అయినప్పటికీ సిగ్గు రాలేదా ? ఇప్పుడు మా ప్రిన్స్ గిల్ జోలికి వస్తున్నావా అంటూ సీరియస్ అవుతున్నారు. హెడ్ అంటే ఊరుకున్నాడు కావచ్చు.. మేము అస్సలు తగ్గేది లేదు.. నీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు గిల్ ఫ్యాన్స్. ఈ మేరకు కోహ్లీ వర్సెస్ గిల్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది.

ఫైనల్స్ కు దూసుకు వెళ్లిన RCB

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్స్ లో దూసుకు వెళ్ళింది బెంగళూరు. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో భాగంగా బెంగుళూరు మొదటి బ్యాటింగ్ చేసి.. 255 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 162 పరుగులకు ఆల్ అవుట్ అయింది గుజరాత్. దీంతో 92 పరుగుల తీయడాక విజయం సాధించిన బెంగుళూరు ఫైనల్ కు దూసుకు వెళ్ళింది.

Advertisement

 

 

 

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×