E-Paper
Advertisement

Virat Kohli : కింగ్ కోహ్లీ.. ఐసీసీ అవార్డుతో సరికొత్త రికార్డ్..

Virat Kohli : ఐసీసీ అవార్డుల పంట పండింది. క్రికెట్ ప్రపంచంలో ఏ అవార్డు ప్రకటించినా సరే, అందులో మన టీమ్ ఇండియా క్రికెటర్లలో ఎవరో ఒకరు ఉండాల్సిందే. ఇప్పుడు అలాంటి అవార్డు అందుకున్న విరాట్ కొహ్లీ క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డ్ సృష్టించాడు. 2023 సంవత్సరానికి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అంతేకాదు ఈ అవార్డును ఎక్కువ సార్లు అందుకున్న ఆటగాడిగా ఒక సరి కొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

Virat Kohli : కింగ్ కోహ్లీ.. ఐసీసీ అవార్డుతో సరికొత్త రికార్డ్..
Advertisement

Virat Kohli : ఐసీసీ అవార్డుల పంట పండింది. క్రికెట్ ప్రపంచంలో ఏ అవార్డు ప్రకటించినా సరే, అందులో మన టీమ్ ఇండియా క్రికెటర్లలో ఎవరో ఒకరు ఉండాల్సిందే. ఇప్పుడు అలాంటి అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డ్ సృష్టించాడు. 2023 సంవత్సరానికి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అంతేకాదు ఈ అవార్డును ఎక్కువ సార్లు అందుకున్న ఆటగాడిగా ఒక సరి కొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

2012, 2017, 2018 ల్లో ఐసీసీ వన్డే క్రికెటర్‌గా కోహ్లీ ఎంపికయ్యాడు. అంతేకాదు క్రికెటర్ ఆఫ్ ది డెకడ్ (దశాబ్ది క్రికెటర్) అవార్డు కూడా తనకే దక్కింది. ఇకపోతే 2017, 2018ల్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలిచాడు. 2019లో స్పిరిట్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఇలా వీటన్నింటినీ లెక్కేస్తే విరాట్ కోహ్లీ మొత్తం 10 ఐసీసీ అవార్డులను సాధించాడు. ఈ నేపథ్యంలో విరాట్ కి దరిదాపుల్లో మరెవరూ లేకపోవడం విశేషం. మహేంద్ర సింగ్ ధోనీ కుమార సంగక్కర ఇద్దరూ కూడా చెరో నాలుగుసార్లు ఐసీసీ అవార్డు దక్కించుకున్నారు.

Advertisement

2023 సంవత్సరానికి వస్తే, కొహ్లీ తర్వాత క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఉస్మాన్ ఖవాజా ఎంపికయ్యాడు.
ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా సూర్యకుమార్ యాదవ్
ఎంపికైన సంగతి తెలిసిందే. ఇలా రెండు ఫార్మాట్లలో మనవాళ్లు ఇద్దరు ఉండటం టీమ్ ఇండియా గొప్పతనమని నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఐసీసీ ఉమెన్ అవార్డులు 2023కి ఎంపికైన వారిలో ఒక్కరు కూడా టీమ్ ఇండియా మహిళా జట్టు నుంచి లేకపోవడం విచారకరమని అంటున్నారు. వరుసగా  అవార్డ్ గ్రహీతలు..

క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – నాట్ సివర్ (ఇంగ్లాండ్)
ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – ఫోబే లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా)
వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – చమరి ఆటపట్టు ( శ్రీలంక)
 అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – క్వింటర్ అబెల్ ( కెన్యా )
టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్ )

Advertisement

వీరే కాకుండా ఇతర అవార్డులు కూడా వచ్చాయి. వాటిలో ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ – రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ కి దక్కింది. ఇకపోతే  ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును జింబాబ్వే దక్కించుకుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×