E-Paper
Advertisement

కావ్య చేసిన పాప‌మే వెంటాడుతోంది..SRHను పాకిస్తాన్ అనుకుని కోహ్లీ ఊచ‌కోత కోశాడు

కావ్య చేసిన పాప‌మే వెంటాడుతోంది..SRHను పాకిస్తాన్ అనుకుని కోహ్లీ ఊచ‌కోత కోశాడు
Advertisement

Virat Kohli-SRH:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నిన్న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రారంభం మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా గట్టిగానే పోరాడాయి. కానీ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 69 పరుగులతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, బెంగళూరులో గెలిపించాడు. ఈ క్రమంలోనే మరోసారి కావ్య పాపపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

Also Read: IPL telecast in Bangladesh: బిగ్ రిలీఫ్‌..బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై నిషేధం ఎత్తివేత‌..ముస్తాఫిజుర్ రీ-ఎంట్రీ !

బెంగుళూరు తొలి విజయం..కావ్య పాపపై ట్రోలింగ్

Advertisement

ఐపీఎల్ 2026 లో హైదరాబాద్ జట్టు పై బెంగళూరు తొలి విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో కావ్య పాపపై దారుణంగా ట్రోలింగ్ మొదలైంది. ఆమె చేసిన పాపాలే ఇప్పుడు వెంటాడుతున్నాయని సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ది హండ్రెడ్ లీగ్ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2.35 కోట్లు పెట్టి మరి అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేశారు. దీంతో కావ్య పాపను దేశద్రోహి అంటూ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు ఇండియన్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. నిన్న బెంగళూరులో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ రెచ్చిపోయి పోస్టులు పెట్టారు. సన్రైజర్స్ హైదరాబాద్ ను కాస్త పాకిస్తాన్ టీం అంటూ దారుణంగా ఆడుకున్నారు.

SRH ను పాకిస్తాన్ అనుకోని ఊచకోత కోసిన కోహ్లీ

విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియా కు ఎన్నో విజయాలు అందించిన విరాట్ కోహ్లీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో కూడా అద్భుతంగా రానిస్తాడు. అయితే విరాట్ కోహ్లీ టీ20 లో పెద్దగా ఆడబోడని టెస్ట్ ప్లేయర్ లాగా అతన్ని ట్రీట్ చేస్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అతని స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువే. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఎన్నడూ లేని విధంగా అద్భుతంగా రాణించాడు విరాట్ కోహ్లీ. ఫాస్ట్ గా పరుగులు చేయడమే కాకుండా సిక్సర్లు అలాగే బౌండరీలు బాదేశాడు.

Advertisement

ఈ క్రమంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిన నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును పాకిస్తాన్ లాగా విరాట్ కోహ్లీ ట్రీట్ చేసినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అటు పాకిస్తాన్ వాళ్లు కూడా, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ గెలవాల‌ని కోరుకున్నారు. గతంలో పాకిస్తాన్ పై ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇండియాకు విజయాలు అందించాడు. పాకిస్తాన్ అంటేనే విరాట్ కోహ్లీకి ఒక ఊపు వస్తుంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ జట్టును కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేశాడు కాబట్టి.. విరాట్ కోహ్లీ 69 పరుగులతో రెచ్చిపోయాడని అంటున్నారు. దీంతో కావ్య పాప చేసుకున్న తప్పిదం కారణంగానే విరాట్ కోహ్లీ ఇరగదీసాడా చెబుతున్నారు.

Also Read: Mohammad Amir: ఐపీఎల్ అంటేనే ఫిక్స‌ర్స్ లీగ్..అంపైర్ల నుంచి చీర్ గ‌ర్ల్స్ అంద‌రూ అమ్ముడుపోయేవాళ్లే

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×