E-Paper
Advertisement

ICC Test Rankings : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టీమిండియా ఆటగాళ్ల దూకుడు..

ICC Test Rankings : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టీమిండియా ఆటగాళ్ల దూకుడు..
Advertisement

ICC Test Rankings :ఐసీసీ టెస్ట్ ర్యాంకులు విడుదలయ్యాయి. ఇందులో టీమ్ ఇండియా ఆటగాళ్లు మూడు విభాగాల్లో తమ ర్యాంకులతో దూసుకెళ్లారు. అంతేకాదు అడుగు నుంచి పైకి వచ్చారు. ముఖ్యంగా విరాట్ కొహ్లీ 10వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ అయితే చాలా కాలం తర్వాత టాప్ 10లోకి వచ్చాడు. ఇక బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో కూడా మన ఆటగాళ్లు ముందడుగు వేశారు.

సౌతాఫ్రికా గడ్డపై జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ విజయంతో టీమ్ ఇండియా ఆటగాళ్ల ర్యాంకులు ఒక్కసారిగా మారాయి. రెండేళ్ల తర్వాత మళ్లీ టాప్ 10లోకి వచ్చిన విరాట్ కొహ్లీ తాజా ర్యాంకుల్లో 6వ స్థానానికి చేరుకున్నాడు. కేప్ టౌన్ టెస్ట్  తొలి ఇన్నింగ్స్ లో  కీలకమైన 46 పరుగులు చేయడంతో ర్యాంకు మెరుగుపడింది.

Advertisement

ఇకపోతే రోహిత్ శర్మ 14వ స్థానం నుంచి 4 స్థానాలు ఎగబాకి 10 కి చేరాడు. ఎట్టకేలకు టెస్ట్ మ్యాచ్ ల్లో టాప్ టెన్ లోకి వచ్చాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్  864 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. టీమ్ ఇండియాతో జరిగిన రెండో టెస్ట్ లో సౌతాఫ్రికా బ్యాటర్  మార్ క్రమ్ సూపర్ సెంచరీ చేసి 9 స్థానాలు పైకి వచ్చి, 20వ ర్యాంకుకి చేరాడు.

ఇక బౌలింగ్ విషయానికి వస్తే… టాప్ 10లో ముగ్గురు భారత బౌలర్లు ఉండటం విశేషం. ఎప్పటిలా రవిచంద్రన్ అశ్విన్ (863 పాయింట్లు) నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా ఒక స్థానం పైకి వచ్చి నాలుగులో నిలిచాడు. అయితే వీరికి రివర్స్ లో రవీంద్ర జడేజా పరిస్థితి కనిపించింది. అందరూ పైకెళితే,  తను ఒక స్థానం కిందకు వెళ్లి ఐదులో నిలిచాడు. అంటే బూమ్రా ఐదు నుంచి నాలుగుకి వెళితే, తను అటు నుంచి ఇటొచ్చాడు.

Advertisement

రెండో టెస్ట్ లో చూస్తే సిరాజ్ ఏకంగా 13 స్థానాలు దూసుకొచ్చి 17వ ర్యాంకులో నిలిచాడు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (434 పాయింట్లు) నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక రవి చంద్రన్ అశ్విన్ (341 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.  

ICC Test Rankings, ICC Rankings,

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×