E-Paper
Advertisement

Virat Kohli: మొన్న నిధిని న‌లిపేశారు..ఇప్పుడు విరాట్ కోహ్లీకి చుక్క‌లు చూపించారు క‌ద‌రా !

Virat Kohli: మొన్న నిధిని న‌లిపేశారు..ఇప్పుడు విరాట్ కోహ్లీకి చుక్క‌లు చూపించారు క‌ద‌రా !
Advertisement

Virat Kohli: మొన్న టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ను లులు మాల్ దగ్గర అభిమానులు నలిపేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అచ్చం నిధి అగర్వాల్ తరహాలోనే విరాట్ కోహ్లీకి ( Virat Kohli ) కూడా ఛేదు అనుభవం ఎదురయింది. న్యూజిలాండ్ వర్సెస్ టీం ఇండియా ( India vs New Zealand, 1st ODI ) మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వడోదరకు ( Vadodara) చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ వస్తున్న నేపథ్యంలో విమానాశ్రయానికి వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక విరాట్ కోహ్లీ కనిపించగానే ఎగబడి మరి ఫోటోలు దిగారు. సెక్యూరిటీ ఎంత ఆపినా కూడా జనాలు ఆగలేదు. విరాట్ కోహ్లీకి ఊపిరి ఆడకుండా చేశారు. అయినప్పటికీ కాస్త ఓపిక తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, కొంతమంది అభిమానులతో ఫోటోలు దిగాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal ) ఎపిసోడ్ గుర్తు చేస్తున్నారు.

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

నిధి అగర్వాల్ కు ఎదురైన అనుభవమే విరాట్ కోహ్లీకి ?

Advertisement

ప్రభాస్ హీరోగా చేసిన ది రాజా సాబ్ సినిమా ఈవెంట్ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ లులు మాల్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఇంటికి వెళ్లే నేపథ్యంలో అభిమానులు ఎగబడి ఆమెను నలిపేశారు. కారు ఎక్కే వరకు ఆమెకు చుక్కలు చూపించారు. సెక్యూరిటీ ఎంత ఆపినా కూడా ఆగలేదు జనాలు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికి వైరల్ అవుతూనే ఉంది. ఇక న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జనవరి 11వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విజయ్ హజారే టోర్నమెంట్ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ నేరుగా మొదటి వన్డే కోసం గుజరాత్ లోని వడోదరకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ని చూసేందుకు జనాలందరూ ఎగబడ్డారు. దీంతో విరాట్ కోహ్లీ కాస్త అసహనంతో కనిపించారు. అయితే చివరికి తన చేతులతో సైగలు చేస్తూ ఫ్యాన్స్ కు బై చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో కోహ్లీ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. రియల్ హీరో వస్తే జనాలు ఇలాగే ఇగబడతారని కామెంట్స్ చేస్తున్నారు.

టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్

Advertisement

టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్ జ‌న‌వ‌రి 11వ తేదీన ప్రారంభం కానుంది. మొద‌టి మ్యాచ్ వ‌డోద‌ర వేదిక‌గా జ‌రుగ‌నుండ‌గా, ఈ నెల 14వ తేదీన రెండో వ‌న్డే జ‌రుగ‌నుంది. మూడో వ‌న్డే జ‌న‌వ‌రి 18వ తేదీన జ‌రుగ‌నుంది.

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×