E-Paper
Advertisement

Dhruv Shorey : వ‌రుస‌గా 5 సెంచ‌రీల‌తో రికార్డు.. వ‌ర‌ల్డ్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్..!

Dhruv Shorey : వ‌రుస‌గా 5 సెంచ‌రీల‌తో రికార్డు..  వ‌ర‌ల్డ్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్..!
Advertisement

Dhruv Shorey :   సాధార‌ణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టమే. ఎప్పుడూ ఏ ఆట‌గాడు ఫామ్ లోకి వ‌స్తాడో.. ఏ ఆట‌గాడు ఫామ్ కోల్పోతాడో కూడా ఊహించ‌లేము. మంచిగా ఆడుతాడ‌నుకున్న ఆట‌గాడు ఫామ్ కోల్పోతే.. అస్స‌లు అంచ‌నా లేని ఆట‌గాళ్లు అంచ‌నాల‌కు మించి ఆడుతుంటారు. ఇది మ‌నం నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ క్రికెట‌ర్ కూడా ఇలాగే రికార్డు సృష్టించాడు. భార‌త దేశవాళీ క్రికెట్ టోర్నీ విజ‌య్ హాజ‌రే ట్రోఫీలో విద‌ర్భ ఓపెన‌ర్ ధ్రువ్ షోరే స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. రాజ్ కోట్ వేదిక‌గా హైద‌రాబాద్ తో జ‌రిగిన గ్రూప్ బీ మ్యాచ్ లో షోరే అజేయ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ క్ర‌మంలో లిస్ట్ ఏ వ‌న్డే ఫార్మాట్ క్రికెట్ లో వ‌రుస‌గా ఐదు సెంచ‌రీలు బాదిన రెండో బ్యాట‌ర్ గా ప్ర‌పంచ రికార్డును స‌మం చేసాడు.

Also Read : INDW vs SLW: షెఫాలీ బీభ‌త్సం..మూడో టీ20లోనూ టీమిండియా విజ‌యం.. సిరీస్ కైవ‌సం

వ‌రుస‌గా ఐదు సెంచ‌రీలు..

Advertisement

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విద‌ర్భ జ‌ట్టుకు ఓపెన‌ర్లు అమాన్ మొఖాడే(82), య‌శ్ రాథోడ్ (68) బ‌ల‌మైన పునాది వేశారు. అనంత‌రం వ‌న్ డౌన్ లో వ‌చ్చిన ధ్రువ్ షోరే ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల పై ఎదురుదాడికి దిగాడు. కేవ‌లం 77 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 భారీ సిక్స‌ర్ల సాయంతో 109 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో విద‌ర్భ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 365 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. గ‌త సీజ‌న్ లో క్వార్ట‌ర్ ఫైన‌ల్ క‌ర్ణాట‌క పై 118 ప‌రుగులు, సెమీ ఫైన‌ల్ హ‌ర్యానా పై 114 ప‌రుగులు, ఫైన‌ల్ క‌ర్ణాట‌క పై 110 ప‌రుగులు చేశాడు. ఈ సీజ‌న్ లో మొద‌టి మ్యాచ్ బెంగాల్ పై 136 ప‌రుగులు, రెండో మ్యాచ్ హైద‌రాబాద్ పై 109 ప‌రుగులు నాటౌట్ గా నిలిచాడు. వ‌రుస‌గా 5 సెంచ‌రీలు చేసి రికార్డు నెల‌కొల్పాడు ధ్రువ్ షోరే.చెన్నై ఇత‌న్ని రెండు మ్యాచ్ ల‌కే జ‌ట్టు నుంచి త‌ప్పించింది. ఇప్పుడు ఈ ఆట‌గాడు అద్బుత‌మైన ఫామ్ లో ఉండ‌టం విశేషం.

జ‌గ‌దీశ‌న్ రికార్డు స‌మం..

గ‌తంలో త‌మిళ‌నాడు బ్యాట‌ర్ జ‌గ‌దీశ‌న్ 2022-23 సీజ‌న్ లో వ‌రుస‌గా 5 సెంచ‌రీలు సాధించి ఈ రికార్డును నెల‌కొల్పాడు. ఇప్పుడు ధ్రువ్ షోరే ఆ ఫీట్ ను రిపీట్ చేసాడు. అంత‌కుముందు కుమార సంగ‌క్క‌ర‌, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్, క‌రుణ్ నాయ‌ర్ వంటి వారు వ‌రుస‌గా 4 సెంచ‌రీలు సాధించారు. షోరే ఇప్పుడు వారంద‌రినీ వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. షోరే మెరుపు సెంచ‌రీతో విద‌ర్బ నిర్దేశించిన 366 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో హైద‌రాబాద్ జ‌ట్టు త‌డ‌బ‌డింది. విద‌ర్భ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో హైద‌రాబాద్ జ‌ట్టు కేవ‌లం 276 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో విద‌ర్భ 89 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ప్ర‌స్తుతం ధ్రువ్ షోరే ఫామ్ చూస్తుంటే.. వ‌చ్చే మ్యాచ్ లో ఆరో సెంచ‌రీ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడేమో అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Also Read : MICT vs DSG: SA 20 సీజన్ 4 షురూ.. ఈ మ్యాచ్ లు ఉచితంగా ఎక్కడ చూడాలంటే

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×