E-Paper
Advertisement

T20 World Cup : T-20 వరల్డ్ కప్ పై వరుణుడి ఎటాక్.. భారత్-పాక్ మ్యాచ్ మీద కూడా

T20 World Cup : T-20 వరల్డ్ కప్ పై వరుణుడి ఎటాక్.. భారత్-పాక్ మ్యాచ్ మీద కూడా
Advertisement

T20 World Cup : T-20 వరల్డ్ కప్ లో క్వాలిఫైయింగ్ మ్యాచ్ లే ఉత్కంఠ భరితంగా జరుగుతుండటంతో… ఇక సూపర్ 12 మ్యాచ్ లు ఎంత హైటెన్షన్ తో సాగుతాయో చూద్దామని క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ… ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లేలా ఉన్నాడు. ముఖ్యంగా వరల్డ్ కప్ లోనే హై ఓల్టేజ్ మ్యాచ్ అయిన భారత్-పాక్ ఫైట్… వరుణుడి కారణంగా జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభంకానుంది. అదే సమయానికి వర్షం పడే అవకాశాలు 90 శాతానికి పైగా ఉన్నాయని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త చెప్పింది. దాంతో… ఆ రోజు వర్షం పడకుండా మ్యాచ్ జరిగి… ఏ వరల్డ్ కప్ లోనూ పాక్ పై ఓటమి లేని టీమిండియా… ఆ రికార్డును కాపాడుకోవాలని… ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు.

ఇప్పటి వరకూ జరిగిన వన్డే వరల్డ్ కప్ ల్లో… భారత్-పాక్ మధ్య 7 మ్యాచ్ లు జరగ్గా… అన్నింటిలోనూ టీమిండియాదే విజయం. అలాగే ఇప్పటివరకు జరిగిన T-20 వరల్డ్ కప్ ల్లో… దాయాదుల మధ్య 5 మ్యాచ్ లు జరగ్గా… ఐదింటిలోనూ భారతే గెలిచి సంబరాలు చేసుకుంది. ఇందులో ఒక మ్యాచ్ తొలి టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా. అందులో పాక్ పై 5 పరుగుల తేడాతో గెలిచిన ధోనీ సేన… టీ-20 వరల్డ్ కప్ ను ముద్దాడింది.

Advertisement

సూపర్-12లో శనివారం ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య సిడ్నీలో జరిగే తొలి మ్యాచ్‌కు కూడా వర్షం బెడద తప్పేలా లేదు. శనివారం సిడ్నీలో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయని ఆస్ట్రేలియా వాతావరణశాఖ వెల్లడించింది. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో… ఆసీస్, కివీస్ అభిమానులు సిడ్నీ మ్యాచ్ పై ఆశలు వదిలేసుకుంటున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×