E-Paper
Advertisement

Varsha Bollamma: న్యూజిలాండ్ క్రికెట‌ర్ల‌ను అవ‌మానించిన టాలీవుడ్ హీరోయిన్‌..వాళ్లంతా సోదిగాళ్లు అంటూ పోస్ట్‌

Varsha Bollamma: న్యూజిలాండ్ క్రికెట‌ర్ల‌ను అవ‌మానించిన టాలీవుడ్ హీరోయిన్‌..వాళ్లంతా సోదిగాళ్లు అంటూ పోస్ట్‌
Advertisement

Varsha Bollamma: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నిన్న అంటే బుధవారం రోజున నాలుగవ టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు టి20 లలో విజయం సాధించిన టీమిండియా, నాలుగవ మ్యాచ్ ను కాస్త లైట్ తీసుకుంది. ఇషాన్ కిషన్ లాంటి స్టార్ క్రికెటర్ కు రెస్ట్ ఇవ్వడంతో టీమిండియా మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాఫ్ అయింది. దీంతో ఈ మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్లను దారుణంగా ట్రోలింగ్ చేసింది టాలీవుడ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ( Varsha Bollamma). న్యూజిలాండ్ క్రికెటర్లు అందరూ సోదిగాళ్లు అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. మ్యాచ్ జరుగుతుండగానే ఈ పోస్టు పెట్టి వాళ్ళ పరువు తీసింది. దీంతో హీరోయిన్ వర్ష బొలమ్మ ( Varsha Bollamma) చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read: Iceland Trolls Pakistan: బాయ్ కాట్ పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోండి..మేం రెడీగా ఉన్నాం, కొలంబోకు టికెట్లు కొనుక్కోవాలి..పాకిస్తాన్ ను ర్యాగింగ్ చేసిన ఐస్‌ల్యాండ్‌

న్యూజిలాండ్ క్రికెటర్ల పరువు తీసిన టాలీవుడ్ హీరోయిన్

Advertisement

టాలీవుడ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ( Varsha Bollamma) గురించి తెలియని వారు ఉండరు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు ముందుకు దూసుకు వెళ్తున్నారు హీరోయిన్ వర్ష (Varsha Bollamma). 2020 సంవత్సరంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వర్ష, స్వాతిముత్యం స్టాండప్ రాహుల్ జాను చూసి చూడంగానే లాంటి సినిమాలు చేసి అదరగొట్టింది. వాస్తవంగా తెలుగులో చూసి చూడంగానే అనే సినిమాతోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హీరోయిన్ వర్ష.

ఇటీవల కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ కూడా తీసింది. ఈ సిరీస్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయితే అలాంటి హీరోయిన్ వర్ష బొల్లమ్మ, క్రికెట్ విపరీతంగా చూస్తారు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ పై కూడా సంచలన పోస్ట్ పెట్టారు హీరోయిన్ వర్ష బొల్ల‌మ్మ‌. న్యూజిలాండ్ క్రికెట‌ర్లు అంద‌రూ సోది గాళ్లు అంటూ ఇజ్జ‌త్ తీశారు. న్యూజిలాండ్ జ‌ట్టులో సోది ( NZ Ish Sodhi) అనే బౌల‌ర్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అత‌ని పేరు స్కోర్ బోర్డుపైన రాగానే, ఏంటి సోది, వీళ్లంతా సోదిగాళ్లే అంటూ వ‌ర్ష బొల్ల‌మ్మ ట్రోల్ చేశారు. న్యూజిలాండ్ క్రికెట‌ర్ సోది ప‌రువు తీసేలా వ‌ర్ష బొల్ల‌మ్మ ఆడుకుంటున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇది ఇలా ఉండ‌గా, న్యూజిలాండ్ వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య 5 టీ20 ల సిరీస్ జ‌రుగుతోంది. ఇందులో వ‌రుస‌గా 3 మ్యాచ్ ల్లో టీమిండియాలో గెలువ‌గా ఒకటి న్యూజిలాండ్ గెలించింది. ఎల్లుండి మరో మ్యాచ్ జ‌రునుంది.

Advertisement

Also Read: Boycott Pakistan: టీ20 ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ కు మ‌రో షాక్‌..బాయ్ కాట్ చేసిన ఆస్ట్రేలియా..ఇక న‌ఖ్వీ బిచ్చ‌గాడు కావాల్సిందే

 

https://www.facebook.com/stories/137974964551662/?view_single=true

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×