E-Paper
Advertisement

Super Over : సున్నాకే 2 వికెట్లు.. వైభ‌వ్ ను సూప‌ర్ ఓవ‌ర్ లో దించ‌క‌పోవ‌డం పై ట్రోలింగ్.. జితేష్ శ‌ర్మ చెత్త కెప్టెన్సీ అంటూ

Super Over : సున్నాకే 2 వికెట్లు.. వైభ‌వ్ ను సూప‌ర్ ఓవ‌ర్ లో దించ‌క‌పోవ‌డం పై ట్రోలింగ్.. జితేష్ శ‌ర్మ చెత్త కెప్టెన్సీ అంటూ
Advertisement

Super Over :   ఏసీసీ రైజింగ్ స్టార్ టోర్నీ సెమిస్ లో భార‌త్ ఏ ఘోరంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా సూప‌ర్ ఓవ‌ర్ లో ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోవ‌డంతో బంగ్లాదేశ్ జ‌ట్టు చాలా ఈజీగా విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో ఫామ్ లో ఉన్న వైభ‌వ్ సూర్య‌వంశీని సూప‌ర్ ఓవ‌ర్ లో ఎందుకు బ్యాటింగ్ కి పంపించ‌లేద‌ని నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. ఈ బ్లండ‌ర్ మిస్టేక్ వ‌ల్ల మ్యాచ్ ఓడిపోయామ‌ని మండిప‌డుతున్నారు. మ‌రోవైపు వైభ‌వ్ ఆడి ఉంటే.. మ్యాచ్ ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు.

Also Read : IND VS SA 2nd Test: నేటి నుంచే రెండో టెస్ట్..లంచ్‌, టీ బ్రేక్ లో మార్పులు, 30 నిమిషాలు ముందుగానే

బంగ్లాదేశ్ భారీ స్కోర్

Advertisement

ముఖ్యంగా ఏసీసీ మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్ టోర్నీ సెమిస్ లో బంగ్లా-ఏతో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త్ ఏ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కు దారి తీసింది. సూప‌ర్ ఓవ‌ర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సున్నాకే 2 వికెట్ల‌ను కోల్పోయింది. దీంతో ఒక ప‌రుగు టార్గెట్ తో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ తొలి బంతికి వికెట్ కోల్పోయింది. ఆ త‌రువాత బంతిని బౌల‌ర్ సుయాష్ శ‌ర్మ వైడ్ వేయ‌డంతో బంగ్లాదేశ్ విజ‌యం సాధించింది. ఈ ఓట‌మితో భార‌త్ ఏ జ‌ట్టు టోర్నీ నుంచి నిష్క్ర‌మించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఏసీసీ మెన్స్ ఆసియా క‌ప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా భార‌త్ ఏ బంగ్లాదేశ్ ఏ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి సెమీ ఫైన‌ల్ న‌రాలు తెగే ఉత్కంఠ మ‌ధ్య కొన‌సాగింది. దోహా వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ సూప‌ర్ ఓవ‌ర్ లో విజ‌యం సాధించి ఫైన‌ల్ కి దూసుకెళ్లింది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఇరు జ‌ట్లు స‌మాన స్కోర్ చేశాయి. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఓపెన‌ర్ హ‌బిబుర్ రెహ్మాన్ సోహన్ (46 బంతుల్లో 65, 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), మెహ్ర‌బ్ (18 బంతుల్లో 48 నాటౌట్, ఫోర్ 6 సిక్స‌ర్లు) చెల‌రేగ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.

వైభ‌వ్ సూర్య‌వంశీ మెరుపులు వృధా..!

భార‌త బౌల‌ర్ల‌లో గుర్ జ‌ప్నిత్ సింగ్(4-0-39-2)హ‌ర్ష దూబే (4-0-22-1) సుయాశ్ శ‌ర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ర‌మ‌ణ్ దీప్ సింగ్(2-0-29-1), న‌మ‌న్ ధిర్ (2-0-33-1) కాస్త ప‌ర్వాలేద‌నిపించారు. అయితే భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ కి మెరుపు ఆరంభం ల‌భించింది. అయితే అది ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఓపెన‌ర్లు వైభ‌వ్ సూర్య‌వంశీ 15 బంతుల్లో 38 ప‌రుగులు చేశాడు. ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 44 ప‌రుగులు చేసినా.. వారి మెరుపులు వృధా అయ్యాయి. జితేష్ శ‌ర్మ (33), నేహ‌ల్ వ‌ధేరా(32 నాటౌట్) చివ‌ర్లో ర‌మ‌ణ్ దీప్, అశుతోష్ శ‌ర్మ‌(13) స‌త్తా చాట‌డంతో అతి క‌ష్టం మీద నిర్ణీత ఓవ‌ర్ల‌లో స్కోర్లు స‌మానమ‌య్యాయి. దీంతో సూప‌ర్ ఓవ‌ర్ జ‌రిగింది. సూప‌ర్ ఓవ‌ర్ లో భార‌త్ బొక్క‌బోర్ల ప‌డింది. తొలి రెండు బంతుల‌కు జితేశ్, అశుతోష్ ఔట్ కావ‌డంతో ఖాతా కూడా తెర‌వ‌లేక‌పోయింది. అనంత‌రం బంగ్లాదేశ్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. కానీ రెండో బంతిని వైడ్ వేయ‌డంతో బంగ్లాదేశ్ విజ‌యం సాధించింది. దీంతో టీమిండియా ఇంటిబాట ప‌ట్ట‌క త‌ప్ప‌లేదు.

Advertisement

Also Read : Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు స్వర్ణం.. సీఎం రేవంత్, డీజీపీ శివధర్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×