E-Paper
Advertisement

Vaibhav Suryavanshi:హ్యాపీ బర్త్ డే వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavanshi:హ్యాపీ బర్త్ డే వైభవ్ సూర్యవంశీ
Advertisement

Vaibhav Suryavanshi: ఇండియాలో క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమె కాదు. అంతకు మించిన ఎమోషన్. కానీ నాకు మాత్రం అదొక యుద్ధం అంటున్నాడు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. 2011 మార్చి 27న బీహార్‌లోని తాజ్‌పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఈ కుర్రోడు  సరిగ్గా మరో రోజు గడిస్తే ipl మొదలయ్యే ఈ సమయంలో 15న ఏట అడుగు పెత్తబోతుండటం విశేషం.మరి సంచలనాలకి కేరాఫ్ అయిన ఈ పాకెట్ డైనమెట్ గూర్చి కొన్ని  సంగతులు తెలుసుకుందాం రండి.

చిన్న వయసులోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం

Advertisement

మాములుగా 12 ఏళ్లకి పిల్లలు ఏం చేస్తుంటారు ? హోం వర్క్‌లతో కుస్తీ పడుతుంటారు.కానీ ఈ కుర్రోడు మాత్రం క్రికెట్ గ్రౌండ్ లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.అంతేకాదండోయ్ ..కేవలం 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. రంజీల్లో అడుగుపెట్టిన ఈ బీహారీ చిన్నోడు గతేడాది ఏకంగా ఐపీఎల్ వేలంలో రూ. 1.1 కోట్లు పలికి అందరికి పెద్ద షాకే ఇచ్చాడు. ఇక దాదాపు 200 పైచిలుకు స్ట్రైక్ రేట్‌తో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతు ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించాడంటే చిన్న వయసులోనే క్రికెట్ ఓనమాలు ఎంతగా అవపోసన పట్టాడో అర్థమవుతుంది.

also read:Relationship Secrets: ప్రేమలో ఉన్నారా ..అయితే ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి.

Advertisement

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ లో బుడ్డోడి వీర బాదుడు 

ఇవన్ని ఒక ఎత్తు అయితే తాజాగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ లో ఈ బుడ్డోడి వీర బాదుడికి స్టేడియం చిన్నబోయింది. యస్..కేవలం 55 బంతుల్లోనే 175 పరుగులతోఇంగ్లండ్ బౌలర్లకు నిద్ర పట్టనీయకుండా చేశాడు. ఇక  అండర్-19 లెవల్లో అతని స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువగా ఉండటం మరో విశేషం . ఇక తాజాగా ఈరోజుతో 15 ఏళ్లు నిండాయి కాబట్టి ఐసీసీ రూల్స్ ప్రకారం సీనియర్ టీమ్ లోకి సూర్య వంశీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మరో వైపు జూనియర్ సచిన్ వస్తున్నాడని క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికే హడావిడి మొదలెట్టేశారు కూడా,

తండ్రి సంజీవ్‌  సాక్రిఫైజ్

అయితే స్టార్ స్టేటస్ పొందిన ఈ కుర్రోడి జర్నీ అంత ఆషామాషీగా జరిగింది ఏం కాదు. కొడుకు ఒక మంచి క్రికెటర్ గా ఎదగాలని ఉన్న ఒక్కగానొక్క పొలాన్ని అమ్మేసిన తండ్రి సంజీవ్‌  సాక్రిఫైజ్ ఎంతో ఉంది.మొత్తానికి తండ్రి కష్టానికి ప్రతి ఫలంగా ఇపుడు వరల్డ్ క్రికెట్ మ్యాప్ లోనే తనకంటూ ఓ సెపరేట్ పేజీనే క్రియేట్ చేసుకున్న వైభవ్ క్రికెట్ లో అడుగుపెట్టాలనుకున్న ఏంతో మందికి ఆదర్శం కూడా .

క్రిస్ గేల్  175 పరుగుల ఐపీఎల్ రికార్డు టార్గెట్ 

ఇక ఈరోజుతో 15వ ఏట అడుగుపెట్టబోతున్న వైభవ్ టార్గెట్ ఒక్కటేనట . అదే.. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న 175 పరుగుల ఐపీఎల్ రికార్డు.ఒకవైపు రాహుల్ ద్రవిడ్ సూపర్ విజన్ , మరో వైపు యువ కెప్టెన్ రియాన్ పరాగ్ సపోర్ట్ ఉండటం చూస్తె ఆ రికార్డుని బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఇక ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్‌కు వైభవ్ ఒక మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు కూడా.
చూడాలి గౌహతీలో తోటి ఆటగాళ్ళ మధ్య బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకుంటున్న ఈ చిచ్చర పిడుగు టీం ఇండియాలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో !

also read:Ram Charan Birthday Special:హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×