E-Paper
Advertisement

Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో

Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో
Advertisement

Vaibhav-Parag:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో భయంకరమైన ఇన్నింగ్స్ ఆడుతూ, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. దీంతో త్వరలోనే టీమిండియా జట్టులోకి వైభవ్ సూర్యవంశీ వస్తాడని చర్చ కూడా మొదలైంది. అయితే అలాంటి 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ పైన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ( Riyan Parag ) కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని చర్చ జరుగుతోంది. తనకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు వైభవ్ సూర్య వంశీకి వస్తున్నాయన్న అసూయతో రియాన్ పరాగ్ వ్యవహరిస్తున్నాడని కూడా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా ఓ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ ప‌రాగ్

Advertisement

ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మొన్న లీగ్ దశలో చివరి మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. ఈ విజయంతో ప్లే ఆఫ్ బెర్త్ ఫిక్స్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. ఈ క్రమంలోనే ఎలిమినేటర్ మ్యాచ్ కోసం ముంబై నుంచి బయలుదేరింది రాజస్థాన్ రాయల్స్. ఈ సందర్భంగా ముంబై విమానాశ్రయంలో ఫోటోగ్రాఫర్లు, వైభవ్ సూర్యవంశీని చూసి ఎగబడ్డారు. అదే సందర్భంగా రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా వైభవ్ సూర్యవంశీ పక్క నుంచి వెళ్తున్నాడు. దీంతో రియాన్ పరాగ్ ను పిలిచి వైభవ్ పక్కన నిల్చోండి.. ఒక ఫోటో తీసుకుంటామని ఫోటోగ్రాఫర్లు అడిగారు. అయితే తామేమి హీరోలం కాదని, బలుపుఏ చూపిస్తూ ఆన్సర్ ఇస్తూ అక్కడి నుంచి అసూయతో వెళ్లిపోయాడు రియాన్ పరాగ్.

దీంతో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఒక్కసారిగా డీలా పడిపోయాడు. తననే కావాలని రియాన్ పరాగ్ అవమానించాడు అన్న యాంగిల్ లో ఎక్స్ ప్రెషన్ పెట్టాడు వైభవ్. ఇక ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు తమ స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. వైభవ్ సూర్య వంశీ ఎదుగుదలను రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ జీర్ణించుకోవడంలేదని సీరియస్ అవుతున్నారు. అందుకే హీరోలం కాదు అంటూ పెద్ద డైలాగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడని మండిపడుతున్నారు. 15 ఏళ్ల వైభవ్ తో ఫోటో దిగితే తన పరువు పోతుందని, ఎక్కువగా ఊహించుకొని రియాన్ పరాజ్ ఇలా వ్యవహరించాడని కౌంటర్లు ఇస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ కు చేరడం వెనుక వైభవ్ సూర్యవంశీ కృషి ఎక్కువగా ఉందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. రియాన్ పరాగ్ ఎక్కడ కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేదని కౌంటర్లు ఇస్తున్నారు.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×