E-Paper
Advertisement

Rohit sharma: రోహిత్ శర్మను ఆటపట్టించిన ఫ్యాన్.. వడాపావ్ అంటూ!

Rohit sharma: రోహిత్ శర్మను ఆటపట్టించిన ఫ్యాన్.. వడాపావ్ అంటూ!
Advertisement

Rohit sharma: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం రోజు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ముంబై – సిక్కిం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక చాలాకాలం తర్వాత లిస్ట్ – ఏ క్రికెట్ లోకి తిరిగి వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 94 బంతుల్లోనే 18 ఫోర్లు, 9 భారీ సిక్సర్ల సాయంతో ఏకంగా 155 పరుగులు సాధించి అభిమానులను అలరించాడు.

Also Read: england cricketers: పీకల దాకా తాగి దొరికిపోయిన క్రికెటర్లు.. ఇంగ్లాండ్ బోర్డు సంచలన నిర్ణయం

Advertisement

రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా సిక్కిం నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు కేవలం 30.3 ఓవర్లలోనే చేదించింది. దీంతో సిక్కింపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముంబై. ఇక రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ కి గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. కాగా ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సుమారు 20 వేల మంది అభిమానులు హాజరయ్యారు.

 

రోహిత్ భాయ్.. “వడపావు తింటావా..?”

Advertisement

ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో మైదానానికి తరలివచ్చారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ కి మద్దతుగా “ముంబై రాజా” అంటూ నినాదాలు చేశారు. అయితే మ్యాచ్ జరుగుతుండగా ఇదే సమయంలో స్టాండ్స్ లోని ఓ అభిమాని రోహిత్ శర్మను ఉద్దేశించి.. ” రోహిత్ భాయ్.. వడపావ్ తింటావా?” అని గట్టిగా అడిగాడు. ఇది వినిపించిన రోహిత్ శర్మ.. నవ్వుతూ వద్దంటూ చేతితో సైగ చేశాడు. అయితే ఈ దృశ్యం కెమెరాలో రికార్డు కావడంతో క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇటీవల రోహిత్ శర్మ తన ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 10 కిలోల వరకు బరువు తగ్గి.. కఠినమైన ఆహార నియమాలను పాటిస్తున్నాడు రోహిత్ శర్మ.

Also Read: Dhoni – salman: ట్రాక్టర్ తో పొలం దున్నిన ధోని & సల్మాన్.. ఒళ్ళంతా బురదతో

 

రోహిత్ శర్మ లక్ష్యం అదే:

వన్డే ప్రపంచ కప్ 2027లో పాల్గొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు రోహిత్ శర్మ. అందులో భాగంగానే ప్రస్తుతం ఫిట్నెస్ కోసం డైట్ మెయింటెన్ చేస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ కి వడాపావ్ అంటే ఎంతగానో ఇష్టం. ఈ వడపావ్ అనేది మహారాష్ట్రకు చెందిన ఓ ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్. దీనిని ఇండియన్ బర్గర్ అని కూడా అంటారు. ఇది హిట్ మ్యాన్ కి ఎంతో ఇష్టమైనప్పటికీ.. ప్రస్తుతం అతడు జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటున్నాడు. మొత్తానికి ఓవైపు పరుగుల వేటతో, మరోవైపు తనదైన శైలిలో అభిమానులతో మ్యాచ్ మధ్యలో సంభాషిస్తూ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ని చిరస్మరణీయం చేశాడు. అలాగే ఈ విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చేసి టీమిండియా సెలెక్టర్లకు ఓ గట్టి సంకేతాన్ని పంపాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×