E-Paper
Advertisement

Uruguay : డ్రాతో గట్టెక్కిన ఉరుగ్వే

Uruguay : డ్రాతో గట్టెక్కిన ఉరుగ్వే
Advertisement

Uruguay : ఫిఫా వరల్డ్‌కప్‌లో మేటి జట్లకు షాక్ మీద షాక్ తగులుతోంది. పసికూనలు అనదగ్గ జట్ల చేతిలో ఇప్పటికే కొన్ని గొప్ప జట్లు ఓడిపోగా… మరికొన్ని జట్లు డ్రాతో సరిపెట్టుకుంటున్నాయి. గ్రూప్-Hలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓటమి అంచుల దాకా వెళ్లిన ఉరుగ్వే… అతికష్టం మీ డ్రా చేసుకుని గట్టెక్కింది. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లు చూస్తే… తమను తేలిగ్గా తీసుకోవద్దని పెద్ద జట్లకు ఆసియా జట్లు హెచ్చరికలు పంపినట్టే కనిపిస్తోంది.

మ్యాచ్ ఆరంభం నుంచే పటిష్టమైన ఉరుగ్వే జట్టును దక్షిణ కొరియా నిలువరిస్తూ వచ్చింది. ఉరుగ్వే ఆటగాళ్లు రెండుసార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించినా… దక్షిణ కొరియా డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. తొలి అర్ధభాగంలో సౌత్ కొరియాకు కూడా ఓ గోల్ వేసే అవకాశం చిక్కింది. కానీ గోల్ కొట్టలేకపోయింది. ఆట 43వ నిమిషంలో గోల్‌పోస్ట్‌కు అత్యంత చేరువలో… తల పైనుంచి వచ్చిన బంతిని దక్షిణకొరియా ఆటగాడు డీగో గాడిన్‌… హెడర్‌గా మలిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రెండు జట్లు గోల్ చేయలేకపోవడంతో ఫస్ట్ హాఫ్ 0-0తో ముగిసింది.

Advertisement

రెండో అర్ధభాగంలో దక్షిణ కొరియా పదేపదే ఉరుగ్వే గోల్ పోస్టులపై దాడి చేసినా… వాటిని గోల్స్ గా మలచలేకపోయింది. ఆట మరో నిమిషంలో ముగుస్తుందనగా… 89వ నిమిషంలో ఫెడెరికో వాల్వెర్డ్‌కు మంచి ఛాన్స్ వచ్చినా… గోల్ వేయలేకపోవడంతో దక్షిణకొరియా ఖాతా తెరవలేకపోయింది. చివరికి ఏ జట్టూ గోల్ చేయలేకపోవడంతో… 0-0 స్కోరుతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఈ మ్యాచ్‌లో సౌత్ కొరియా కెప్టెన్‌ సన్‌ హ్యుంగ్‌ మిన్‌ ప్రత్యేకమైన ఫేస్‌మాస్క్‌తో బరిలోకి దిగాడు. ఇటీవల చాంపియన్స్‌ లీగ్‌ ఆడుతున్న సమయంలో ప్రత్యర్థి ఆటగాడు బలంగా తగలడంతో… హ్యుంగ్‌ మిన్‌ ఎడమ కంటికి గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా ఆపరేషన్ చేయాలని చెప్పినా… చేయించుకుంటే ప్రపంచకప్‌కు దూరమవుతానని భావించి… వాయిదా వేశాడు. ముందు జాగ్రత్తగా ఫేస్‌మాస్క్‌ పెట్టుకుని ఈ మెగా టోర్నీలో ఆడుతున్నాడు. అతనికి మద్దతుగా సౌత్ కొరియా అభిమానులు కూడా బ్యాట్‌మన్‌ లాంటి మాస్క్‌లతో స్టేడియంలో కనిపించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×