E-Paper
Advertisement

Mumbai Indians : జియో, MIపై విమర్శలు…. BCCI ఏం పీకుతోంది!

Mumbai Indians : జియో, MIపై విమర్శలు…. BCCI ఏం పీకుతోంది!
Advertisement

Mumbai Indians: ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నారు. తొలుత గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు టాప్ ప్లేస్ లో కొనసాగాయి. కొద్ది రోజుల తరువాత ఆర్సీబీ టాప్ లోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టాప్ లోకి వచ్చేసింది. ఇవాళ గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే.. మళ్లీ టాప్ లోకి దూసుకొచ్చే అవకాశాలున్నాయి. ఇలా ఐపీఎల్ లో ఏ టీమ్ ఎప్పుడూ పుంజుకుంటుందో ఊహించడం కూడా కష్టంగా మారిందనే చెప్పాలి.

Also Read : Ambani’s Dog: అంబానీ ఇంట విషాదం.. కుక్క కోసం ముంబై ప్లేయర్లకు నరకం చూపిస్తున్నారా?

Advertisement

ఇదిలా ఉంటే.. బీసీసీఐ ఓ నిబంధనను ఉల్లంఘించిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. కాన్ ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెన్స్ ను నివారించే క్రమంలో బోర్డు పదవులలో ఉన్నవారికి ఐపీఎల్ జట్లతో ఎటువంటి సంబంధం ఉండకూడదనేది బీసీసీఐ పాటిస్తున్న ఓ నిబంధన. అయితే ముంబై ఇండియన్స్ యజమాని రిలయన్స్ ప్రస్తుతం COI కే పాల్పడుతోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ ప్రసారం చేస్తున్న జియో, ఓ జట్టు కు యజమానిగా ఉండటం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. అయితే డీఆర్ఎస్ నిర్ణయాలకు జియోకి సంబంధం ఉండదని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ విమర్శించడం విశేషం.

మరోవైపు అంపైరింగ్ విధానం కూడా కాస్త తలనొప్పిగా మారుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో సమస్య మరింత కాస్త ఎక్కువ అయిందనే చెప్పాలి. బంతి బ్యాట్ కి తగలకున్నా ఔట్ ఇవ్వడం.. డీఆర్ఎస్ విషయంలో అంపైర్లు కొన్ని ఫ్రాంచైజీలకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని వివాదాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ విషయంలో అంపైర్లు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఔట్ అయిన విధానం పై అంపైర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇషాన్ కిషాన్ విషయంలో అంపైర్ ముంబై ఇండియన్స్ కి ముంబై కి అనుకూలంగా నిర్ణయం ప్రకటించాడంటూ నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

Advertisement

ఇటీవల మరో డీఆర్ఎస్ డిసిషన్ కూడా వివాదస్పదంగా మారింది. ముంబై-రాజస్థాన్ లో భాగంగా రోహిత్ శర్మ డీఎస్ఎస్ విషయంలో కాపాడారంటూ అంపైర్ మండిపడుతున్నారు నెటిజన్లు. ముంబై ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో అంపైర్ రోహిత్ ను ఎల్బీడబ్ల్యూ గా ప్రకటించాడు. కానీ రోహిత్ చివరి క్షణంలో రివ్యూ కోరాడు. అయితే థర్డ్ ఎంపైర్ బాల్ ట్రాకింగ్ చేయడంతో బంతి లెగ్ స్టంప్ బయట పిచ్ అయినట్టు తేలింది. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక సమస్య ఎక్కడ వచ్చిందంటే.. డీఆర్ఎస్ నిబంధనల ప్రకారం.. 15 సెకన్లలోపే రివ్యూ తీసుకోవాలి. ఈ మ్యాచ్ లో రోహిత్ రివ్యూ కోరినప్పుడు టైమర్ 0 సెకన్లు చూపించింది. అంటే రివ్యూ టైమ్ కంప్లీట్ అయిన తరువాతనే అంపైర్లు రోహిత్ శర్మ రివ్యూని ఓకే చేశారు. ఈ విషయం గురించి వివాదస్పదంగా మారడం విశేషం. ఇలా రకరకాలుగా ముంబై ఇండియన్స్ పై ట్రోలింగ్ చేయడం గమనార్హం.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×