// // Trolling On Rohit Sharma: సెంచ‌రీ చేసినా రోహిత్ పై ఆగ‌ని ట్రోలింగ్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా
Advertisement

Trolling On Rohit Sharma: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా చివరి వన్డే (England vs India, 3rd ODI) జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సి ఉండగా… చాలా నిర్లక్ష్యంగా టీమిండియా ఆడింది. బౌలింగ్ లో చెత్త ప్రదర్శన చేసినప్పటికీ… బ్యాటింగ్ లోను సరైన సమయంలో ప్లేయర్లు రాణించలేకపోయారు. ముఖ్యంగా సెంచరీ హీరో రోహిత్ శర్మ స్లో బ్యాటింగ్ కూడా కొంపముంచినట్లు ఇప్పుడు ట్రోలింగ్ మొదలైంది. ఈ క్ర‌మంలోనే 1- 2 తేడాతో వ‌న్డే సిరీస్ ను కూడా ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిన‌ట్లు ఆడుకుంటున్నారు. రోహిత్ శ‌ర్మ‌తో ( Rohit Sharma) పాటు, గిల్ ( Gill) బ్యాటింగ్ పై ఫైర్ అవుతున్నారు.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ

Advertisement

ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య లార్డ్స్ వేదికగా  (Lords) ఆదివారం మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగా.. ఆ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ ఆచి తూచి ఆడడం జరిగింది. ఈ క్రమంలోనే చివరలో ఆస్కింగ్ రేటు పెరిగి.. టీమిండియా ఓటమిపాలైంది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లోనే రిటైర్మెంట్ అవుతాడని ప్రచారం జరగగా సెంచరీ మాత్రం నమోదు చేశాడు. 110 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ… 138 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో 5 సిక్సర్లతో పాటు 17 బౌండరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ గతంలో కంటే ఈ మ్యాచ్ లో చాలా ఒత్తిడిలో కనిపించారు. రిటైర్మెంట్ వార్తలు వచ్చిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఆడారు. అందుకే మ్యాచ్ ప్రారంభమైన నుంచి అవుట్ అయ్యే వరకు స్లోగా.. బంతులను చూసుకుంటూ.. ఆడడం జరిగింది.

టీమిండియా నుంచి తీసేస్తార‌నే భ‌యంతో బ్యాటింగ్

వికెట్ పోతే తనను టీమ్ ఇండియా నుంచి తీసేస్తారు అన్న భయం కూడా రోహిత్ శర్మలో పుట్టింది. అందుకే లార్డ్స్ వ‌న్డేలో చాలా జాగ్రత్తగా ఆడాడు. ఈ అతి జాగ్రత్త టీమ్ ఇండియా కొంపముంచింది. రోహిత్ శర్మ, గిల్ ఇద్దరూ ఎక్కువ బంతులు వాడి తక్కువ పరుగులు సాధించారు. అలాగే కీలకమైన సమయాల్లో వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఇంగ్లాండు బౌలర్లు… మిడిల్ అలాగే టెలెండర్లను త్వరగా పెవీలియన్ కు పంపించేశారు. దీంతో 27 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవలసి వచ్చింది. అదే రోహిత్ శర్మ మొదటి నుంచి హిట్టింగ్ ఆడుతూ… బ్యాటింగ్ చేసి ఉంటే.. చివరలో ఆస్కింగ్ రేట్ పెరిగేది కాదు. చాలా సులభంగా ఇండియా గెలిచేది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను మళ్ళీ ట్రోలింగ్ చేస్తున్నారు. రోహిత్ శర్మది జిడ్డు బ్యాటింగ్ అంటూ ఆడుకుంటున్నారు.

Advertisement

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !


Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×