E-Paper
Advertisement

Tilak Varma: ఆ విషయం తెలియగానే అమ్మా, నాన్న ఏడ్చేశారు: తిలక్ వర్మ

Tilak Varma: ఆ విషయం తెలియగానే అమ్మా, నాన్న ఏడ్చేశారు: తిలక్ వర్మ
Advertisement

Tilak Varma: చాలామంది యంగ్ క్రికెటర్లు.. ఐపీఎల్ ద్వారానే బీసీసీఐ దృష్టిని ఆకర్షిస్తారు. అందులో పోటీని దాటుకుంటూ తమ బెస్ట్ పర్ఫార్మెన్స్‌ను చూపించిన వారు టీ20, టెస్ట్ లాంటి పెద్ద టోర్నమెంట్స్‌కు సెలక్ట్ అవుతున్నారు. కొంతమంది ఐపీఎల్ ప్లేయర్స్ ఈ అవకాశం కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూస్తే.. కొందరికి మాత్రం కొన్ని ఐపీఎల్ సీజన్స్ తర్వాత అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. అందులో తెలుగు తేజం తిలక్ వర్మ కూడాయాడ్ అవ్వడం విశేషం.

టీమిండియాలో తరపున టీ20లో పాల్గొనడానికి తిలక్ వర్మకు పిలుపు వచ్చింది. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని, భావోద్వేగాలను టీమిండియా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు ఈ యంగ్ క్రికెటర్. తన చిన్ననాటి స్నేహితుడు తాను టీమిండియా టీ20లో సెలక్ట్ అయిన విషయాన్ని తనకు ఫోన్ చేసి చెప్పాడని చెప్పుకొచ్చాడు తిలక్. ‘నేను ఈ విషయాన్ని అమ్మా, నాన్నకు వీడియో కాల్ చేసిన చెప్పాను. వారు సంతోషంలో ఏడ్చేశారు. నా కోచ్ సలామ్ బయాష్ కూడా ఎమోషనల్ అయ్యారు’ అని తెలిపాడు.

Advertisement

‘ఇండియన్ టీమ్‌కు సెలక్ట్ అవ్వడం చాలా పెద్ద విషయం. అవకాశం వచ్చిన తర్వాత నా ప్రయాణంలో తోడుగా ఉన్న చిన్నప్పటి స్నేహితులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌తో మాట్లాడాను. ఆ తర్వాత నిద్రపోతున్నప్పుడు కూడా సెలక్షన్ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఇది పెద్ద విషయమే అయినా ప్రస్తుతం నేను ఆడుతున్న ఆటలో సౌత్ జోన్‌పై గెలవడం కూడా నాకు ముఖ్యమే. మ్యాచ్ బాగానే సాగుతుంది కానీ మేము ఎక్కువ స్కోర్ సాధించలేకపోయాం. అయినా కూడా మేము విన్ మీద ఆశలు వదులుకోలేదు’ అని ప్రస్తుతం ఆడుతున్న దులీప్ ట్రాఫీ మ్యాచ్ గురించి చెప్పుకొచ్చాడు తిలక్ వర్మ.

ఐపీఎల్‌లో ముంబాయ్ ఇండియన్స్‌లో ఆడిన విధంగా ఇండియన్ టీ20 స్క్వాడ్‌లో కూడా తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌రే ఆడే అవకాశం ఉంది. ఈ విషయంలో పోలార్డ్ తరపున తనకు అందిన ప్రోత్సాహాన్ని గుర్తుచేసుకున్నాడు తిలక్. అంతే కాకుండా తనకు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లు కూడా సలాహాలు ఇస్తున్నారని, తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఎప్పుడూ ఆటకు తగినట్టుగా తన మైండ్‌సెట్‌ను మార్చుకుంటానని తిలక్ వర్మ బయటపెట్టాడు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×