E-Paper
Advertisement

T20 World Cup 2026: ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభ‌వార్త‌, రూ.100ల‌కే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టికెట్లు..ఇలా కొనుగోలు చేసుకోండి !

T20 World Cup 2026: ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభ‌వార్త‌, రూ.100ల‌కే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టికెట్లు..ఇలా కొనుగోలు చేసుకోండి !
Advertisement

T20 World Cup 2026: క్రికెట్ అభిమానులకు ఐసీసీ అదిరిపోయే న్యూస్ అందించింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 100 రూపాయలకే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మ్యాచులు చూసేలా ప్లాన్ చేసింది. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండవ టి20 న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన టికెట్లను విడుదల చేసింది.

Also Read: ICC ODI rankings: నెంబ‌ర్ 1, 2 ర్యాంకింగ్స్ లో రోహిత్‌, కోహ్లీ..గంభీర్ ఇక ఉరేసుకోవాల్సిందే అంటూ ట్రోల్స్ ?

వంద రూపాయలకే టి20 ప్రపంచ కప్ టికెట్లు

Advertisement

ఇండియా అలాగే శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మొదటి విడత టికెట్ల ధరలు ఇండియాలో 100 రూపాయల నుంచి ఉండనున్నట్లు ప్రకటన చేసింది ఐసీసీ. అటు శ్రీలంకలో జరిగే మ్యాచ్ ల టికెట్ల ధరలు 295 రూపాయలుగా ఫిక్స్ చేశారు. అంటే 295 నుంచి టికెట్ల ధరలు ప్రారంభమవుతాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా తన తొలి మ్యాచ్ యూఏఈ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను ఇవాళ సాయంత్రం 6:45 గంటలకు రవి శాస్త్రి, టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ రిలీజ్ చేశారు. అటు దక్షిణాఫ్రికా కెప్టెన్ మర్కరం కూడా తమ మొదటి మ్యాచ్ టికెట్స్ రిలీజ్ చేసారు.

టి20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ అయింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ మెగా టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు ఆడనున్నాయి. ఈ 20 జట్లను ఐదు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. ఇండియా అలాగే పాకిస్తాన్ గ్రూప్ ఏ లో ఉన్నాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ జరగనుంది. ఇండియాలో పాకిస్తాన్ పర్యటించదు కాబట్టి, ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ శ్రీలంకలోని కొలంబో వేదికగా నిర్వహించనున్నారు. పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ శ్రీలంకలోనే జరుగుతుంది.

Advertisement

ఒకవేళ సెమీస్, అలాగే ఫైనల్ కు పాకిస్తాన్ చేరితే, అప్పుడు కూడా శ్రీలంకలోనే మ్యాచ్ లు ఉంటాయి. గ్రూప్ దశలోనే పాకిస్తాన్ ఎలిమినేట్ అయితే, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. సెమిస్ ముంబైలో నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉప్పల్ అలాగే విశాఖ స్టేడియాలలో ఒక మ్యాచ్ కూడా లేదు. దీనిపై తెలుగు అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక ఈ టీ20 వర‌ల్డ్ క‌ప్ టోర్న‌మెంట్ 2026 మ్యాచ్ టికెట్లు https://tickets.cricketworldcup.com/ ఈ వెబ్ సైట్ లో కొనుగోలు చేయ‌వ‌చ్చును.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×