E-Paper
Advertisement

ఐపీఎల్ చీర్ లీడ‌ర్ తో క్వింట‌న్ డికాక్ ఎ**ఫైర్‌, సీక్రెట్లు బ‌య‌ట‌పెట్టిన లలిత్ మోడీ

ఐపీఎల్ చీర్ లీడ‌ర్ తో క్వింట‌న్ డికాక్ ఎ**ఫైర్‌, సీక్రెట్లు బ‌య‌ట‌పెట్టిన లలిత్ మోడీ
Advertisement

De Kock Married a Cheerleader:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ముగిసిన నేపథ్యంలో లలిత్ మోడీ (LALIT MODI) సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. తాను చైర్మన్ గా ఉన్నప్పటి విషయాలను తాజాగా బయట పెడుతూ అందరికి షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ (Quinton de Kock) ఐపీఎల్ చీర్ లీడర్ తో (Cheerleader) రిలేషన్ లో ఉన్నాడని.. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. అయితే వీళ్ళ ఇద్దరి రిలేషన్ షిప్ ను.. ఐపీఎల్ రేటింగ్ పెంచేందుకు వాడుకున్నట్లు కూడా వెల్లడించారు. స్వయంగా తామే, ఇద్దరి రిలేషన్ బయటపెట్టి… ఐపీఎల్ రేటింగ్ పెంచినట్లు స్పష్టం చేశారు. దీంతో లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

క్వింటన్ డికాక్ ఎ*ఫైర్ తో మేం ఆడుకున్నాం – లలిత్ మోడీ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో మైదానం బయట జరిగిన సంఘటనలు అన్నీ కూడా ప్లాన్ ప్రకారం జరిగినవే అంటూ మాజీ చైర్మన్ లలిత్ మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాకు కెప్టెన్ గా ఒకప్పుడు ఉన్న క్వింటన్ డికాక్ చీర్ లీడర్ తో రిలేషన్ పెట్టుకున్నాడని.. వెల్లడించారు. అయితే దానిని కావాలని తామే లీక్ చేశామని వివరించారు. దాంతో ఐపిఎల్ రేటింగ్స్ బాగా పెరిగిపోయాయి అని వెల్లడించారు లలిత్ మోడీ. తర్వాత క్వింటన్ డికాక్… ఆమెను పెళ్లి చేసుకున్నాడని స్పష్టం చేశారు.

రేటింగ్స్ పడిపోయినప్పుడల్లా వివాదం సృష్టిస్తూనే ఉంటామని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. కాంట్రవర్సీ అనే నెంబర్ వన్ పిల్లర్ మీద ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నిర్మితమైందని వ్యాఖ్యానించారు. దీనిపై ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రం సీరియస్ అవుతున్నారు. ఐపీఎల్ పై ఇలా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. ఇండియాను మోసం చేసి లండన్ లో సెటిల్ అయిన లలిత్ మోడీ.. ఇప్పుడు కావాలని ఐపిఎల్ పైన బురద జల్లుతున్నారని మండిపడుతున్నారు. వాడి మాటలు అస్సలు నమ్మకూడదని కోరుతున్నారు.

క్వింటన్ డికాక్ లవ్ స్టోరీ ఇదే

Advertisement

దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్… సాషా అనే ఐపీఎల్ చీర్ లీడర్ ను 2012లో ప్రేమించాడు. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట, 2016 సెప్టెంబర్ లో మారిషస్ లో పెళ్లి చేసుకుంది. ఇక క్వింటన్ డికాక్ దంపతులకు 2022 జనవరిలో కియారా అనే కుమార్తె కూడా జన్మించింది. ఇండియాలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడల్లా ఆమె కూడా ఇక్కడికి వచ్చి చిల్ అవుతున్నారు. కాగా ఈ ఏడాది ముంబై ఇండియన్స్ తరఫున క్వింటన్ డికాక్ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×