E-Paper
Advertisement

West Indies Vs India : వర్షంతో చివరి రోజు ఆట రద్దు.. రెండో టెస్టు డ్రా.. సిరీస్ 1-0 తేడాతో భారత్ కైవసం..

West Indies Vs India : వర్షంతో చివరి రోజు ఆట రద్దు.. రెండో టెస్టు డ్రా.. సిరీస్ 1-0 తేడాతో భారత్ కైవసం..
Advertisement

West Indies Vs India : వెస్టిండీస్ పై రెండో టెస్టులో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలన్న టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. వాన కురవడంతో చివరిరోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఈ టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. విండీస్ గెలవాలంటే 289 పరుగులు చేయాలి. కానీ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడలేదు. ఐదో రోజు ఆట రద్దైంది. అంపైర్లు మ్యాచ్ ను డ్రాగా ప్రకటించారు. తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన రోహిత్ సేన సిరీస్ ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 438 పరుగులు చేసింది. కోహ్లీ అద్భుతంగా ఆడి సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 181/2 వద్ద డిక్లేర్ చేసింది. రోహిత్, ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 365 లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ జట్టు.. నాలుగో రోజు ఆటముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన మహ్మద్ సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Advertisement

భారత్ -వెస్టిండీస్ మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ గురువారం బ్రిడ్జిటౌన్ లో జరుగుతుంది. ఈ నెల 29న రెండో వన్డే, ఆగస్టు 1న మూడో మ్యాచ్ నిర్వహిస్తారు. వన్డే సిరీస్ తర్వాత 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ టీమిండియా-విండీస్ మధ్య జరుగుతుంది. ఆగస్టు 3,6,8,12, 13 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరుగుతాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×