// // PCBకు బాబ‌ర్ ఆజం కండీష‌న్- Staging.BigTvLive -->
E-Paper
Advertisement

PCBకు బాబ‌ర్ ఆజం కండీష‌న్…నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిల‌బ‌డాలంటే నిల‌బ‌డాలి

PCBకు బాబ‌ర్ ఆజం కండీష‌న్…నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిల‌బ‌డాలంటే నిల‌బ‌డాలి
Advertisement

Babar Azam Condition For Pakistan Captaincy:  పాకిస్తాన్ క్రికెట్ జట్టులో (Pakistan cricket team) కీలక మార్పులు జరుగుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ (2027 ODI World Cup tournament) కోసం సిద్ధమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… టైటిల్ గెలిచే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనికోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇక లేటెస్ట్ గా బాబర్ ఆజంకు (Babar Azam) పిలిచి మరి టెస్ట్ కెప్టెన్సీ ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే రెండు సంవత్సరాల తర్వాత టెస్ట్ కెప్టెన్సీ దక్కించుకున్న బాబర్ ఆజం, మొహ్సిన్ న‌ఖ్వీకి ఝ‌లక్ ఇచ్చాడట. టెస్ట్ కెప్టెన్సీ తీసుకునే ముందు ఒక కండీషన్ పెట్టినట్లు నేషనల్ మీడియాలో పెద్దనాలు వస్తున్నాయి. టెస్ట్ కెప్టెన్సీ తో పాటు మిగిలిన రెండు ఫార్మాట్స్‌ కెప్టెన్సీ (Pakistan Captaincy) అప్పగించాలని ష‌ర‌తు పెట్టినట్లు తెలుస్తోంది. అలా అయితేనే టెస్ట్ కెప్టెన్సీ తీసుకుంటానని బాబర్ ఆజం భీష్మించుకొని కూర్చున్నాడట. ఇక చేసేదేమీ లేక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

PCBకు బాబ‌ర్ కండీష‌న్…నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిల‌బ‌డాలంటే నిల‌బ‌డాలి

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్ గా బాబర్ ఆజం (Babar Azam) బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో బాబర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే అంతకు ముందు టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరించిన షాన్ మసూద్ విఫలమయ్యాడు. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో… షాన్ మసూద్ పైన వేటు వేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ క్రమంలోనే బాబర్ ఆజంకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. అయితే ఈ టెస్ట్ కెప్టెన్సీ తీసుకునే ముందు… బాబర్ లిటిగేషన్ పెట్టాడు. టెస్ట్ కెప్టెన్సీ కాకుండా… మిగిలిన వన్డే, టి20లో కూడా తననే కెప్టెన్ చేయాలని కండిషన్ పెట్టాడు. ఇక చేసేదేమీ లేక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా దిగివచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు కథనాలు వైరల్ అవుతున్నాయి.

బాబర్ పెట్టిన కండిషన్ పై PCB రియాక్షన్ ఇదే

బాబర్ ఆజం పెట్టిన కండిషన్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన అధికారులు స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ అలాగే త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టుల్లో పాకిస్తాన్ మెరుగ్గా రాణిస్తే.. బాబర్ కండీషన్ ను పరిశీలిస్తామని వెల్లడించారు. టెస్టుల్లో అద్భుతంగా రానిస్తే ఖచ్చితంగా వన్డే తో పాటు టి20 కెప్టెన్సీ అప్పగిస్తామని వివరించారు. అంతకు ముందు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాలని సల్మాన్ ఆఘాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇక వేరే గత్యంతరం లేక బాబర్ ఆజంకు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇది అదునుగా చేసుకొని… మూడు ఫార్మాట్స్ కెప్టెన్సీ ఇవ్వాలని షరతు పెట్టాడు బాబర్.

Advertisement

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×