E-Paper
Advertisement

Temba Bavuma: ఉన్నది 3 ఫీట్లే.. కానీ పాకిస్థాన్ ను వణికించాడు.. చరిత్ర సృష్టించాడు!

Temba Bavuma: ఉన్నది 3 ఫీట్లే.. కానీ పాకిస్థాన్ ను వణికించాడు.. చరిత్ర సృష్టించాడు!
Advertisement

Temba Bavuma: మూడు టి2-0, మూడు వన్డే, మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మొదట టి-20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా 2 – 0 తో నెగ్గింది. అనంతరం వన్డే సిరీస్ లో మాత్రం పాకిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. సౌత్ ఆఫ్రికా గడ్డపై 3-0 తో వన్డే సిరీస్ ని కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన టెస్ట్ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా విజయ దుందుభి మోగించింది.

Also Read: Jasprit Bumrah – ICC Champions Trophy 2025: ఇంగ్లండ్‌, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్?

Advertisement

సెంచూరియస్ లో జరిగిన తొలి టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో రెండు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమిపాలైంది. ఇక శుక్రవారం ప్రారంభమైన రెండవ టెస్ట్ ని పాకిస్తాన్ ఘోర పరాజయంతో ముగించింది. సోమవారం రోజు ముగిసిన ఈ రెండవ టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ ని సౌత్ ఆఫ్రికా 2-0 తో కైవసం చేసుకుంది. రెండో టెస్ట్ లో టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

సౌత్ ఆఫ్రికా ఓపెనర్ రియాన్ రికెల్టన్ భారీ డబుల్ సెంచరీ (259) పరుగులతో విరుచుకుపడ్డాడు. ఇక కెప్టెన్ తెంబా బవుమా (106) శతకంతో రాణించాడు. అలాగే వికెట్ కీపర్ వెరెయెన్నే 100, మార్కో జాన్సన్ 62, కేశవ్ మహారాజ్ 40 పరుగులు చేశారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా ఏకంగా 615 పరుగుల స్కోర్ చేసింది. ఈ క్రమంలో తన మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ కేవలం 194 పరుగులకే కుప్ప కూలింది.

Advertisement

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో 478 పరుగులు చేసింది. అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 7.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. తొలి టెస్ట్ లో విజయం సాధించడంతోనే డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్ ని దక్కించుకుంది సౌత్ ఆఫ్రికా. ఈ క్రమంలో సౌత్ఆఫ్రికా కెప్టెన్ తెంబ బవుమా సరికొత్త రికార్డుని సాధించాడు. తొలి తొమ్మిది టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన నాలుగవ కెప్టెన్ గా బవుమా నిలిచాడు.

Also Read: MS Dhoni – Lady Fan: ఫ్లైట్‌ లో ధోనికి తినిపించిన మిస్టరీ లేడీ.. సాక్షి సీరియస్ వార్నింగ్ !

ఇప్పటివరకు తన కెప్టెన్సీలో 9 టెస్టులు ఆడి వరుసగా 8 గెలుపొందగా.. ఒక టెస్ట్ డ్రా చేసుకున్నాడు. పాకిస్తాన్ పై విజయంతో ఈ ఘనతను సాధించాడు. దీంతో బవుమా పై ప్రశంశల వర్షం కురుస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఉన్నది మూడు ఫీట్లే.. కానీ పాకిస్తాన్ జట్టుని వణికించాడని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. పెర్సీ చాప్ మన్ ( ఇంగ్లాండ్) తొలి తొమ్మిది మ్యాచ్ లని గెలిపించాడు. ఆ తరువాత వార్విక్ ఆర్మ్ స్ట్రాంగ్ ( ఆస్ట్రేలియా) తొలి ఎనిమిది మ్యాచ్ లను గెలిపించాడు. లిండ్సే హాస్సెట్ (ఆస్ట్రేలియా) 8 మ్యాచ్ లను గెలిపించాడు. ఇప్పుడు బవుమా తొలి 9 బ్యాచ్ లని గెలిపించిన 4 వ కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×