E-Paper
Advertisement

TG20 లీగ్ లో ‘బాసింగ బలాలు’ సాంగ్…మ‌ళ్లీ ట్రోలింగ్ షురూ !

TG20 లీగ్ లో ‘బాసింగ బలాలు’ సాంగ్…మ‌ళ్లీ ట్రోలింగ్ షురూ !
Advertisement

Telangana Folk Songs in TG20:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఒక పక్క టి20 సిరీస్ జరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం టీజీ 20 లీగ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. గత నెలలో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium) వేదికగా ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచులు జరుగుతున్నాయి. గ్రూప్ స్టేజ్ లో మ్యాచులు ఫినిష్ కాగా.. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జానపద పాటలను ఉప్పల్ స్టేడియంలో తాజాగా ప్రదర్శించారు. ప్రముఖ సింగర్లు వచ్చి.. పాటలు పాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

TG20 లీగ్ లో ‘బాసింగ బలాలు’ సాంగ్…మ‌ళ్లీ ట్రోలింగ్ షురూ !

Advertisement

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీనిధి యూనివర్సిటీ టీజీ 20 లీగ్ (Telangana Folk Songs in TG20 ) అద్భుతంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ జరుగుతున్న క్రమంలో గురువారం ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లు జరిగాయి. అయితే కీలక మ్యాచ్ లు జరిగిన నేపథ్యంలో మధుప్రియ, బోలే లాంటివాళ్ళు ఉప్పల్ స్టేడియంలో సందడి చేసి… తెలంగాణ జానపద పాటలను అందుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ‘బాసింగ బలాలు’ అనే పాట కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే అదే పాటను స్టేడియంలో ప్రదర్శించారు. దీంతో స్టేడియానికి వచ్చిన క్రికెట్ అభిమానులు.. ఈ పాటలు ఎంజాయ్ చేశారు. ఏపీ అలాగే తెలంగాణ అనే భేదం లేకుండా తిలకించారు.

ఉప్పల్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium) వేదికగా తెలంగాణ జానపద పాటలను ప్రదర్శించగా.. కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ భాష తమకు అర్థం కావడంలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఒక పదాన్ని అర్థం చేసుకునే లోపు.. మరో స్వరం పాడుతున్నారని హేళన చేశారు. దీంతో మళ్లీ తెలంగాణ ప్రాంతీయ భాష పై ఏపీ నెటిజెన్స్ ట్రోలింగ్ చేయడం ప్రారంభించారని చర్చ మొదలైంది. అయితే ఈ ట్రోలింగ్ పై కొంత మంది ఏపీ వాసులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకరిద్దరూ కారణంగా.. ఏపీ,  తెలంగాణ ( Telangana – AP) ప్రజల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని మండిపడుతున్నారు. అనవసరంగా రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదని కోరుతున్నారు. ఎప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కటేనని హితువు పలుకుతున్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెబుతున్నారు.

Advertisement

 Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×