E-Paper
Advertisement

Teams Who Have Never Won IPL Trophy: ఈ జట్లకి ఐపీఎల్ ట్రోఫీ ఎందుకు రాలేదు?

Teams Who Have Never Won IPL Trophy: ఈ జట్లకి ఐపీఎల్ ట్రోఫీ ఎందుకు రాలేదు?
Advertisement
4 Teams Who Have Never Won IPL Trophy
 

4 Teams Who Have Never Won IPL Trophy: ఐపీఎల్ 2024 సీజన్ మరో రెండురోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికి ట్రోఫీ సాధించని నాలుగు జట్లున్నాయి. వీటిలో ఒకటి ఆర్సీబీ గురించి చర్చించుకున్నాం. ఇంకా మిగిలిన మూడింటిలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. మరిప్పుడు వాటి సంగతేమిటో చూద్దాం.

పంజాబ్ కింగ్స్ విషయం చెప్పాలంటే ఐపీఎల్ సీజన్ 2014లో ఫైనల్ వరకు వెళ్లింది. అప్పుడు కెప్టెన్ జార్జ్ బెయిలీ. ఆ సీజన్ లో పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్ గా నిలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే అనూహ్యంగా నాకౌట్ మ్యాచ్ లో ఓటమి పాలైంది.

Advertisement

పంజాబ్ కింగ్స్ ఓటమికి ప్రధాన కారణాలేమిటంటే…
1. ఒక మంచి కెప్టెన్ ప్రధాన సమస్య
2. పంజాబ్ కింగ్స్ కి ఎప్పుడూ మంచి కోచ్, టీమ్ మెంటర్స్ లేరు
3. మిడిల్ ఆర్డర్ బలంగా లేదు
4. ఆల్ రౌండర్ల కొరత వేధిస్తోంది
5. కీలక సమయాల్లో వికెట్లు తీసే మంచి స్పిన్నర్లు లేరు

Also Read: మళ్లీ కామెంటరీ బాక్స్ లోకి సిక్సర్ల సిద్దూ..

Advertisement

ఢిల్లీ క్యాపిటల్స్ మాటేమిటి?

ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే 2020లో జట్టు ఫైనల్ వరకు వెళ్లింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పరాజయం పాలైంది. ఆనాడు ఢిల్లీ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ వైఫల్యానికి కారణాలేమిటి?
1. ఢిల్లీ క్యాపిటల్స్ కి సరైన కెప్టెన్ లేడు
2. మంచి ఓపెనర్లు లేరు. వీరు త్వరగా అయిపోవడంతో ఆ ప్రెజర్ మిడిల్ ఆర్డర్ మోయలేకపోతోంది.
3.ఆల్ రౌండర్స్ కొరత వేధిస్తోంది.
వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఉండాలి. స్పిన్నర్ కమ్ బ్యాటర్ ఉండాలి. ఇలా ప్రతీ విభాగంలో టూ ఇన్ వన్ ఉన్నప్పుడే జట్టు బలంగా ఉంటుంది.

లక్నో సూపర్ జెయింట్స్ సంగతేమిటి?

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఐపీఎల్ లోకి కొత్తగా 2022లో ప్రవేశించింది. అది రెండు సీజన్లు మాత్రమే ఆడింది. రెండింట్లో కూడా టాప్ ఫోర్ లో నిలిచింది. బెస్ట్ టీమ్ గా ఉండేందుకు ప్రయత్నించింది.

కొన్ని సమస్యలు వీరికి ఉన్నాయి…
1. మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది. వీళ్లెప్పుడు టాపార్డర్ పైనే ఆధారపడి ఉన్నారు.
2. మంచి ఆల్ రౌండర్స్ లేరు.
3. స్పిన్ విభాగం కూడా బలహీనంగా ఉంది. రవి బిష్ణోయ్ ఒక్కడే ఉన్నాడు. అతను క్లిక్ అయిన రోజు బాగుంటుంది. ఆరోజు అతనికి పిచ్ సహకరించకపోతే ఇంతే సంగతి అన్నట్టు ఉంటోంది.

ఇదండీ సంగతి. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం సందర్భంగా ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోని జట్లు, వాటి వెనుక కారణాలు ఇవి. ఈసారైనా వీటిని అధిగమించి ముందంజ వేస్తారని ఆశిద్దాం.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×