E-Paper
Advertisement

Team India:శభాష్ టీమిండియా.. అన్ని ఫార్మాట్ లలో మనమే నెం.1

Team India:శభాష్ టీమిండియా.. అన్ని ఫార్మాట్ లలో మనమే నెం.1
Advertisement

Team India:మెన్‌ ఇన్‌ బ్లూ అరుదైన ఫీట్‌ ను అందుకుంది. అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నెంబర్‌ వన్‌ జట్టుగా అవతరించింది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌ ప్రకారం భారత జట్టు.. ఏకకాలంలో టీ20, వన్డే, టెస్టుల్లో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు టెస్టుల్లో నెంబర్‌ వన్‌ గా ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేయడంతో రోహిత్‌ సేన ఈ రికార్డు సాధించింది.

భారత క్రికెట్‌ చరిత్రలో ఇలా మూడు ఫార్మాట్లలో టాప్‌ ప్లేస్‌ లోకి రావడం ఇదే ఫస్ట్‌ టైం. టెస్టుల్లో 115, వన్డేల్లో 114, టెస్టుల్లో 267 పాయింట్లతో భారత్‌ అగ్రశేణి జట్టుగా కొనసాగుతోంది. అయితే ఇలాంటి ఫీట్‌ నే గతంలో సౌతాఫ్రికా జట్టు మాత్రమే అందుకుంది. అది కూడా 2014లో. హషీమ్‌ ఆమ్లా నేతృత్వంలోని సఫారీల జట్టు 2014లో అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆ తర్వాత మరే జట్టు కూడా ఇలాంటి ఫీట్‌ను అందుకోలేకపోయింది. తాజా ర్యాంకింగ్స్‌ తో ఈ ఘనతను సొంతం చేసుకున్న రెండో జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించింది.

Advertisement

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టు ముందువరకు ఆస్ట్రేలియా అధికకాలం టెస్టుల్లో నెంబర్‌ వన్‌ గా కొనసాగింది. అయితే తొలి టెస్టు మ్యాచ్‌ లో ఆసీస్‌ ఇన్నింగ్స్‌, 132 పరుగుల తేడాతో ఓటమి చెందడంతో ర్యాంకింగ్స్‌ లో కిందకు దిగజారింది. ఆస్ట్రేలియా ర్యాంకు రెండో స్థానానికి పడిపోవడంతో.. భారత్‌ టాప్‌ ప్లేస్‌ కు చేరుకుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×