E-Paper
Advertisement

Team India: రాజ‌స్థాన్ అడ‌వుల్లో చిక్కుకున్న టీమిండియా ప్లేయ‌ర్లు..బీసీసీఐకి తెలియ‌కుండానే సంప్ ?

Team India: రాజ‌స్థాన్ అడ‌వుల్లో చిక్కుకున్న టీమిండియా ప్లేయ‌ర్లు..బీసీసీఐకి తెలియ‌కుండానే సంప్ ?
Advertisement

Team India:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ పూర్తయింది. ఇక ఈ రెండు జట్ల మధ్య జనవరి 21వ తేదీ నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య 5 t20 లు జరగాలు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూలు ఖరారు అయింది. అయితే ఈ టి20 సిరీస్ కంటే ముందు టీమిండియా ప్లేయర్లు అడవిలో దట్టమైన అడవిలో చక్కర్లు కొడుతూ కనిపించారు. టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో టీమిండియా ప్లేయర్ లందరూ అడవికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే వీళ్ళు అడవికి వెళ్ళిన విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలికి చెప్పలేదని తెలుస్తోంది.

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

రాజస్థాన్ అడవుల్లో టీమిండియా ప్లేయర్లు

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జనవరి 21వ తేదీ నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలోని టీమిండియా సభ్యులు ట్విస్ట్ ఇచ్చారు. భారత క్రికెట్ నియంత్రణ మండలికి సమాచారం ఇవ్వకుండానే అడవిలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. వైల్డ్ లైఫ్ లో భాగంగా సీక్రెట్ గా రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్క్ ( Ranthambore Tiger safari ) కు టీమ్ ఇండియా ప్లేయర్లు వెళ్లినట్లు తెలుస్తోంది. నేషనల్ పార్క్ కు వెళ్లిన వారిలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రవి బిస్నోయి, రింకు సింగ్ ఇలాంటి టీమిండియా ప్లేయర్లు ఉన్నారు. ఈ ప్లేయర్ లందరూ ఓ జీప్ తీసుకొని… నేషనల్ పార్క్ లో సందడి చేశారు.

నిపుణుల ఆధ్వర్యంలోనే వెళ్ళు నేషనల్ పార్క్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వీడియోలు తీస్తూ సందడి చేశారు. మరి కొంతమంది ప్లేయర్లు ఫోటోలు కూడా దిగారు. అయితే నేషనల్ పార్క్ లో టీమిండియా ప్లేయర్లు తిరిగే సమయంలో సంజు శాంసన్ జీప్ నడుపుతూ కనిపించాడు. ఇషాన్ కిషన్ అతని పక్కన కూర్చోగా, వెనకాల టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్ అలాగే రవి బిస్నోయి ఉన్నారు. ఇక వీళ్లు ఎంజాయ్ చేసిన వీడియోలు బయటకు వచ్చాయి.

బీసీసీఐకి సమాచారం ఇవ్వకుండానే నేషనల్ పార్కు టీమిండియా ప్లేయర్లు

Advertisement

నేషనల్ మీడియా కథనం ప్రకారం భారత క్రికెట్ నియంత్రణ మండలికి సమాచారం ఇవ్వకుండానే రాజస్థాన్లోని ఈ రణథంబోర్ నేషనల్ పార్క్ ( Ranthambore Tiger safari ) కు టీమిండియా ప్లేయర్లు వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో బిసిసిఐ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో టి20 మ్యాచ్ పెట్టుకుని ఇలా నేషనల్ పార్కులు తిరిగితే… ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చిందట బీసీసీఐ. దీనిపై క్లారిటీ ఇవ్వాలని సూర్య కుమార్ యాదవ్ కు కూడా ఆదేశాలు వచ్చాయట.

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×