// // India Vs South Africa : సౌతాఫ్రికాపై టెస్ట్ మ్యాచ్ గెలుపు.. మళ్లీ టీమిండియా నెంబర్ 1 - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

India Vs South Africa : సౌతాఫ్రికాపై టెస్ట్ మ్యాచ్ గెలుపు.. మళ్లీ టీమిండియా నెంబర్ 1

India Vs South Africa : సౌతాఫ్రికాపై టెస్ట్ మ్యాచ్ గెలుపు.. మళ్లీ టీమిండియా నెంబర్ 1
Advertisement

India Vs South Africa : సౌతాఫ్రికా గడ్డపై తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇన్నింగ్స్, 32 పరుగుల ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా ఒక్కసారిగా ఐదో స్థానానికి పడిపోయింది. తర్వాత  అదే టెస్ట్ మ్యాచ్ లో స్లో రన్ రేట్ కారణంగా రెండు పాయింట్లను ఐసీసీ కట్ చేసింది. దీంతో ఐదో స్థానం నుంచి ఆరుకి పడిపోయింది.

ఇప్పుడు రెండో టెస్ట్ లో సౌతాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేయడం దగ్గర నుంచి మొదలు పెట్టి, రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 26 పాయింట్లు కలిశాయి. దీంతో 54.16  పాయింట్లతో ఎప్పటిలాగే తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. యథాతథంగా సౌతాఫ్రికాను రెండో స్థానానికి నెట్టింది.

Advertisement

ఇండియాకి సగర్వంగా ఫ్లయిట్ ఎక్కి సంతోషంతో ఆటగాళ్లందరూ తిరిగి వస్తున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి నుంచి తాము బయటపడటమే కాదు, భారతదేశ క్రికెట్ అభిమానులకు కూడా ఆ బాధను మరిచిపోయేలా చేశారు.

 సౌతాఫ్రికా పర్యటనలో టీ 20 సిరీస్, టెస్ట్ సిరీస్ లను డ్రా చేసుకుని, వన్డే సిరీస్ ను గెలిచింది.  ఇలా ఒక్క ఫార్మాట్ లో కూడా ఓడిపోకుండా ఒక సరికొత్త రికార్డ్ తో టీమ్ ఇండియా స్వదేశానికి తిరిగి వస్తోంది.

Advertisement

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25  టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు టీమ్ ఇండియా  4 మ్యాచ్‌లు ఆడింది.  వీటిలో 2 గెలిచింది. ఒకటి డ్రా చేసింది. మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. అలా వెస్టిండీస్‌ గడ్డపై 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. తాజాగా సౌతాఫ్రికా పర్యటనలో 1-1తో సమం చేసింది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ కూడా 50 విజయాల శాతంతో మూడో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో బంగ్లాదేశ్, ఆరో స్థానంలో పాకిస్తాన్, ఏడో స్థానంలో వెస్టిండీస్, ఎనిమిదో స్థానంలో ఇంగ్లాండ్, తొమ్మిదో స్థానంలో శ్రీలంక ఉన్నాయి.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×