// //
Rohit sharma on India vs Srilanka match(Sports news headlines): గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయామని, అది ఒకే ఒక్కడి వల్ల జరిగిందని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ శ్రీలంక స్పిన్నర్ జెఫ్రె వండర్సే(6/33) అసాధారణ బౌలింగ్‌తో తమ పతనాన్ని శాసించాడని చెప్పాడు. అదీకాక బ్యాటింగులో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ మిస్ అయ్యిందని అన్నాడు. అది ఉంటే, ఓవర్ లో ఒకట్రెండు అయినా లూజ్ బాల్స్ పడతాయని, అవి కొడుతూ వెళితే మ్యాచ్ గెలవడం సులువు అయ్యేదని తెలిపాడు.
టాస్ ఓడిపోవడం కూడా కీలకంగా ఉందని తెలిపాడు. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిడిల్ ఓవర్లలో పిచ్ ఓవర్ స్పిన్ అవుతోందని అన్నాడు. అందుకే తొలి 10 ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం ముఖ్యమని తెలిపాడు.
ఇకపోతే, మ్యాచ్ ఓడిపోతే ఎవరికైనా బాధగా, నిరాశగా ఉంటుందని అన్నాడు. కాకపోతే ఈ రోజు మేం రాణించలేకపోయాం. ఇది ఒప్పుకొని తీరాల్సిందేనని తెలిపాడు. ఈ ఒక్క వైఫల్యాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదన్నాడు.