E-Paper
Advertisement

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
Advertisement

Tanveer Ahmed On IND VS ZIM: టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఈ రెండింటిలో కూడా టీమ్ ఇండియా అద్భుతమైన విక్టరీ నమోదు చేసుకుంది. మరో టి20 మిగిలి ఉండగానే సిరీస్ కూడా గెలుచుకోవడం గమనార్హం. అయితే వరుసగా రెండు టీ20 లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా పై పాకిస్తాన్ మాజీలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇండియా సిరీస్ గెలవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ). జింబాబ్వే క్రికెట్ జట్టును బెదిరించి మరి.. సిరీస్ ను కైవసం చేసుకున్నారని ఆరోపణలు చేశారు. ఐపీఎల్ పేరుతో జింబాబ్వే క్రికెటర్లను కీలు బొమ్మలను చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్.

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Advertisement

జింబాబ్వే పై టీ20 సిరీస్ ( T 20 series) గెలిచిన టీమిండియాపై భారతదేశ వ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఉంటే… పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం ఇండియా గెలుపును హేళన చేస్తున్నారు. చిన్నచూపు చూస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కూడా దీనిపై స్పందించారు. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన ఒత్తిడిలో.. జింబాబ్వే చేతిలో కూడా టీమిండియా వైట్ వాష్ అయ్యేదని బాంబు పేల్చాడు. కానీ టీమిండియా పరువు అంతర్జాతీయంగా పోతుందని.. బీసీసీఐ కుట్రలకు తెరలేపినట్లు ఆరోపణలు చేశారు.

జింబాబ్వే క్రికెట్ బోర్డును బెదిరించి మరి.. సిరీస్ గెలిచారని తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో జింబాబ్వే ప్లేయర్లకు అవకాశాలు ఇస్తామని… భవిష్యత్తులో జింబాబ్వే క్రికెట్ బోర్డును ఆదుకుంటామని బీసీసీఐ హామీ ఇచ్చి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే జింబాబ్వే ప్లేయర్లు కావాలనే టీమిండియా చేతిలో ఓడిపోయినట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. దీనిపై కచ్చితంగా ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టీమిండియా పరువు కోసం ఇలా దిగజారడం బీసీసీఐకి తగునా ? అంటూ నిలదీశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రెండో టి20 లో కూడా టీమిండియా విక్టరీ

Advertisement

జింబాబ్వే జరిగిన రెండో టి20 లో కూడా టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో టి20 లో ఏకంగా 90 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది శ్రేయస్ అయ్యర్ సేన. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 219 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో విఫలమైన జింబాబ్వే…కుప్ప‌కూలింది. ఈ తరుణంలో జింబాబ్వేపై సిరీస్ కైవ‌సం చేసుకుంది.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం Tanveer Ahmed On IND VS ZIM

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×