E-Paper
Advertisement

Tanveer Ahmed: ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా ఆడ‌టానికి సిగ్గుండాలి..చేత‌కాక‌పోతే రిటైర్మెంట్ ఇవ్వండి

Tanveer Ahmed: ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా ఆడ‌టానికి సిగ్గుండాలి..చేత‌కాక‌పోతే రిటైర్మెంట్ ఇవ్వండి
Advertisement

Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 25% టోర్నమెంట్ కూడా ఫినిష్ అయింది. అయితే ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ ఇద్దరూ కూడా గాయాల బారిన పడ్డారు. గాయం అయినప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ లో ( Impact Rule) కనిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. అటు రోహిత్ శర్మ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ ( Kohli), రోహిత్ శర్మ ఇద్దరూ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడడానికి కొంచెం కూడా సిగ్గుగా లేదా ? అంటూ మండిపడ్డారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడడం కంటే, రిటైర్మెంట్ ఇస్తే బాగుండు అంటూ చురకలు అంటించారు తన్వీర్ అహ్మద్. దీంతో రోహిత్ శర్మ ( Rohit Sharma), విరాట్ కోహ్లీ పైన ( Virat Kohli) తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్క‌డ స్టేడియాల‌పైనే బాంబులు ప‌డ‌తాయి

ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా ఆడ‌టానికి సిగ్గుండాలి – తన్వీర్ అహ్మద్ 

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ పోషిస్తున్న విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్. డబ్బుల కోసం కకృత్తి పడే ఈ ఇద్దరు క్రికెటర్లు.. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడెందుకు దిగజారిపోయారని మండిపడ్డారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఇలాంటి అరాచకాలు ప్రతిరోజు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే కంటే రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోవడం బెటర్ అన్నారు. లేకపోతే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి వస్తే కచ్చితంగా మంచి అవకాశాలు ఇప్పిస్తానని భరోసా కల్పించారు తన్వీర్ అహ్మద్.

దీంతో తన్వీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మలను ఉద్దేశించి తన్విర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇండియన్ క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఏంటి ? అది కూడా పెద్ద పోస్టే అంటున్నారు. ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ టోర్న‌మెంట్ ( IPL 2026 ) నేప‌థ్యంలో విరాట్ కోహ్లీకి తీవ్ర గాయం, జ్వ‌రం ఉన్న‌ప్ప‌టికీ ఆర్సీబీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని వెల్ల‌డిస్తున్నారు. అందుకే ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా రాణిస్తున్న‌ట్లు చెబుతున్నారు. రోహిత్, కోహ్లీ లాంటి ప్లేయ‌ర్ల‌ను విమ‌ర్శిస్తే ఊరుకునేది లేదంటూ మండిప‌డుతున్నారు.

Advertisement

 

Also Read:  Ahmed Shehzad: PSLలో వార్న‌ర్, స్మిత్ లాంటి ఐపీఎల్ రిజెక్టెడ్ ప్లేయ‌ర్లు త‌ప్ప, ఎవ‌డూ మిగ‌ల‌లేదు

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×