E-Paper
Advertisement

ఐపీఎల్ కోసం పాకిస్తాన్ ను బ‌లి ప‌శువు చేస్తారా ? ఆస్ట్రేలియా B టీమ్ ను పంప‌డంపై త‌న్వీర్ సీరియ‌స్‌

ఐపీఎల్ కోసం పాకిస్తాన్ ను బ‌లి ప‌శువు చేస్తారా ? ఆస్ట్రేలియా B టీమ్ ను పంప‌డంపై త‌న్వీర్ సీరియ‌స్‌
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Pakistan vs Australia) మధ్య వన్డే సిరీస్ కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో కీలక ప్లేయర్లను పాకిస్తాన్ పంపించకుండా క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా B టీంను మాత్రమే పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. కీలక ప్లేయర్ లందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఫినిష్ అయిన తర్వాత పాకిస్తాన్ వెళ్తారు. అయితే పాకిస్తాన్ కు ఆస్ట్రేలియా కు సంబంధించిన B జట్టును పంపించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. షాహిద్ అఫ్రిది నుంచి మొదలుకొని తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వరకు ఫైర్ అవుతున్నారు.

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

ఐపీఎల్ కోసం పాకిస్తాన్ ను బలి చేస్తారా ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా B జట్టును మాత్రమే పాకిస్తాన్ పంపిస్తున్నారు. అయితే ఈ అంశంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ చాలా సీరియస్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ క్రికెట్ నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి మోచేతి నీళ్లు క్రికెట్ ఆస్ట్రేలియా తాగుతోందని సీరియస్ అయ్యారు. కేవలం దేశవాలి క్రికెట్ అయినా ఐపీఎల్ కోసం అంతర్జాతీయ సిరీస్ ను క్రికెట్ ఆస్ట్రేలియా లైట్ తీసుకుంటోంద‌ని నిప్పులు చెరిగాడు తన్వీర్ అహ్మద్. ఆస్ట్రేలియాకు సంబంధించిన టాప్ క్రికెటర్లను ఐపీఎల్ కోసం వదిలేసి.. పాకిస్తాన్ తో జరిగే వన్డే సిరీస్ కోసం బచ్చా క్రికెటర్లను ఎలా పంపిస్తారని ఫైర్ అయ్యారు. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం ప్రకారం వన్డే సిరీస్ జరిగితే పాకిస్తాన్ ( Pakistan) పరువు గంగలో కలుస్తుందని సంచలన కామెంట్లు చేశారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఐసీసీకి లేఖ రాస్తామని హెచ్చరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును వెంటనే బ్యాన్ చేయాలని కూడా కోరారు. దీనిపై కచ్చితంగా పోరాటం కొనసాగుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తన్వీర్ అహ్మద్.

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వన్డే సిరీస్ ఎప్పుడు అంటే?

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Australia) మధ్య వన్డే సిరీస్ ఈ నెల చివరలో ప్రారంభం కానుంది. మే 30వ తేదీన ఈ టోర్నమెంట్ షోరూం అవుతుంది. 25వ తేదీన ఇస్లామాబాద్ కు ఆస్ట్రేలియా క్రికెటర్లు ( Australia cricketers) చేరుకోబోతున్నారు. 30వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే జరుగుతుంది. జూన్ రెండవ తేదీన రెండవ వన్డే, నాలుగో తేదీన మూడవ వన్డే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది.

Advertisement

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook !

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×