E-Paper
Advertisement

Abhishek Sharma: తీవ్ర‌మైన క‌డుపునొప్పి, విష జ్వ‌రం..ఆస్ప‌త్రిలో అభిషేక్ శర్మ..సంజుకు బంప‌ర్ ఆఫ‌ర్‌ ?

Abhishek Sharma: తీవ్ర‌మైన క‌డుపునొప్పి, విష జ్వ‌రం..ఆస్ప‌త్రిలో అభిషేక్ శర్మ..సంజుకు బంప‌ర్ ఆఫ‌ర్‌ ?
Advertisement

Abhishek Sharma:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియా కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందే టీమ్ ఇండియా డేంజర్ బౌలర్ హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ గాయాల బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే హర్షిత్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. వాషింగ్టన్ సుందర్ ఆడేది నమ్మకమే లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా అరివీర భయంకర బ్యాటర్ అభిషేక్ శర్మ ( abhishek sharma) ఆస్పత్రి పాలు అయినట్లు తెలుస్తోంది. తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో అభిషేక్ శర్మ ( abhishek sharma health update) బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నమీబియాతో జరిగే మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరం అవుతాడని అంటున్నారు.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

తీవ్ర‌మైన క‌డుపునొప్పి, విష జ్వ‌రం..ఆస్ప‌త్రిలో అభిషేక్ శర్మ ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అభిషేక్ శర్మకు తీవ్ర జ్వరంతో పాటు కడుపునొప్పి చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అభిషేక్ శర్మ ఆసుపత్రి పాలు అయినట్లు తెలుస్తోంది. మొన్న ముంబై వేదికగా మ్యాచ్ జరిగిన సందర్భంగా హోటల్ లో తిన్న ఆహారం వల్ల అస్వస్థతకు అభిషేక్ శర్మ గురైనట్లు తెలుస్తోంది.

దీంతో అభిషేక్ శర్మకు జ్వరంతోపాటు కడుపునొప్పి కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆసుపత్రికి కూడా అభిషేక్ శర్మ వెళ్లాడట. మొన్న రాత్రి జ్వరంతోనే గౌతమ్ గంభీర్ ఇంట్లో జరిగిన విందుకు అభిషేక్ శర్మ హాజరయ్యాడు. ఆ తర్వాత కడుపునొప్పి కూడా విపరీతంగా చోటు చేసుకుందట. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో అభిషేక్ శర్మ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ అనారోగ్యం నేపథ్యంలో నమిబియాతో ఈ నెల 12వ తేదీన జరగబోయే మ్యాచ్ కు దూరమవుతాడని అంటున్నారు. ఇక అభిషేక్ శ‌ర్మ ఆడ‌క‌పోతే, సంజు శాంస‌న్ కు బంప‌ర్ ఆఫ‌ర్ త‌గుల‌నుంది. అభిషేక్ స్థానంలో సంజు వ‌చ్చేస్తాడు.

టి20 ప్రపంచ కప్ లో గాయాల బారిన టీమిండియా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కాకముందే.. టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయాల బారిన పడ్డారు. మొదటగా తిలక్ వర్మ వృషణాలకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని… చివరి క్షణంలో టీమిండియా జట్టులో చేరాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ చేతికి గాయమైంది. అతడు ఇంకా జట్టులో చేరలేదు. ఇది మరవక ముందే టీమిండియా బౌలర్ హర్షిత్ రాణా కాలిగాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో హర్షిత్ రాణా స్థానంలో మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగాడు. ఇక మొన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా వైరల్ ఫీవర్ బుమ్రా సోకింది. ఇక ఇప్పుడు అభిషేక్ శర్మకు అనారోగ్యం చోటుచేసుకుంది. ఇలా అయితే టి20 ప్రపంచ కప్ గెలవడం కష్టమే అంటున్నారు.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×