E-Paper
Advertisement

T20 WORLDCUP: సెమీస్ లో ఇంగ్లాండ్ తో భారత్ ఢీ..కివీస్, పాక్ మధ్య తొలి సెమీస్ పోరు

T20 WORLDCUP: సెమీస్ లో ఇంగ్లాండ్ తో భారత్ ఢీ..కివీస్, పాక్ మధ్య తొలి సెమీస్ పోరు
Advertisement

T20 WORLDCUP: టీ20 వరల్డ్ కప్ లో భారత్ సెమీస్ లోకి ప్రవేశించింది. చివరి లీగ్ మ్యాచ్ లో జింబాబ్వేను 71 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తొలుత బ్యాంటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ( 51 పరుగులు) మరోసారి హాఫ్ సెంచరీ సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత్ బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ జట్టులో సికిందర్ రాజా 34 పరుగులు, ర్యాన్ బర్ల్ 35 పరుగులతో కాసేపు మెరుపులు మెరిపించారు. భారత్ బౌలర్లు చెలరేగడంతో జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీయగా..షమీ, పాండ్యా తలో రెండు వికెట్లు, భువనేశ్వర్, అర్షదీప్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ కు ఫ్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.

Advertisement

జింబాబ్వేపై విజయంతో భారత్ జట్టు గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించిన రోహిత్ సేన సెమీస్ లో గ్రూప్-1లో రెండోస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 10న జరుగుతుంది. నవంబర్ 9న జరిగే తొలి సెమీస్ లో న్యూజిలాండ్ , పాకిస్థాన్ జట్లు తలపడతాయి. పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించి సెమీస్ కు చేరింది. అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ కు సెమీస్ బెర్త్ దొరికింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×