E-Paper
Advertisement

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి మ‌రో ప్లేయ‌ర్ ఔట్? ఆ ఇద్ద‌రు గంభీర్ శిష్యుల‌కు ఛాన్స్ !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి మ‌రో ప్లేయ‌ర్ ఔట్? ఆ ఇద్ద‌రు గంభీర్ శిష్యుల‌కు ఛాన్స్ !
Advertisement

T20 World Cup 2026:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) కంటే ముందు టీమిండియా జట్టుకు ఊహించని షాక్ తగలే ప్రమాదం పొంచి ఉంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి అంటే ముందు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. ఈ లిస్టులో తిలక్ వర్మతో పాటు వాషింగ్టన్ సుందర్ లాంటి డేంజర్ ఆల్ రౌండర్లు ఉన్నారు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభాని కంటే ముందు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు గాయాల బారిన పడ్డారు. దీంతో ఈ ఇద్దరు ప్లేయర్లు t20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఆడడం కష్టమేనని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో గౌతమ్ గంభీర్ తన శిష్యులను ఇద్దరిని జట్టులోకి దించబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తిలక్ వర్మ అలాగే వాషింగ్టన్ సుందర్ స్థానంలో గిల్ , అలాగే ఆయుష్ బడోని లాంటి అనామక ప్లేయర్ ను తీసుకు వస్తున్నాడట. ఈ మేరకు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Ind vs NZ 2nd ODI: తెలుగోడికి 2 ఓవ‌ర్లేనా..గిల్ ద‌రిద్ర‌మైన నిర్ణ‌యాలు..రెండో వ‌న్డేలో టీమిండియా ఓట‌మికి 5 కార‌ణాలు

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి మ‌రో ప్లేయ‌ర్ ఔట్?

Advertisement

టి20 వరల్డ్ కప్ కంటే ముందు న్యూజిలాండ్ తో వన్డేలతో పాటు టి20లలో ఆడనుంది టీం ఇండియా. ఇందులో భాగంగానే న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 3 వన్డేల సిరీస్ కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ పూర్తి కాగానే న్యూజిలాండ్ తో 5 టీ20 లు జరగ‌నున్నాయి. అయితే, ఈ మెగా టోర్నమెంట్ కంటే ముందు రిష‌బ్ పంత్, తిలక్ వర్మ, తాజాగా వాషింగ్టన్ సుందర్ గాయాల బారిన పడ్డారు. తెలుగు కుర్రాడు తిలక్ వ‌ర్మ‌కు వృషణాలకు సంబంధించిన ఆపరేషన్ జరిగింది. దీంతో అతడు న్యూజిలాండ్ తో జరిగే ఐదు టీ20 లతోపాటు టి20 వరల్డ్ కప్ న‌కు దూరం అవుతాడని ప్రచారం చేస్తున్నారు. కానీ న్యూజిలాండ్ తో జరిగే మూడు టీ20 లకు తిలక్ వర్మ దూరం అవుతాడని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అతడు కోలుకుంటేనే టి20 ప్రపంచ క‌ప్ ఆడుతాడు.

అటు ప్రాక్టీస్ చేస్తుండగా రిషబ్ పంత్ నడుముకు గాయమైంది. దీంతో న్యూజిలాండ్ తో జరిగే మూడు వన్డేలకు దూరమయ్యాడు పంత్. వాషింగ్టన్ సుందర్ మొదటి వన్డే సందర్భంగా బ్యాక్ స్ట్రైన్ కారణంగా వన్డే సిరీస్ కు పూర్తిగా దూరమైపోయాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం న్యూజిలాండ్ తో జరిగే ఐదు టీ20లతో పాటు టి20 వరల్డ్ కప్ నకు కూడా దూరం అవుతాడని అంటున్నారు.

తిలక్, వాషింగ్టన్ సుందర స్థానంలో గంభీర్ శిష్యులు

Advertisement

తిలక్ వర్మ అలాగే వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ గాయాల బారిన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ తో జరిగే ఐదు టీ20ల‌లో అలాగే టీ20 వరల్డ్ కప్ న‌కు ఇద్దరు దూరమవుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ అలాగే వాషింగ్టన్ సుందర స్థానంలో గంభీర్ శిష్యులు గిల్ అలాగే ఆయుష్ బడోని రంగంలోకి దిగుతారని ప్రచారం జోరుగా సాగుతోంది.

Also Read: Ind vs NZ 2nd ODI: కోహ్లీకి ఘోర అవ‌మానం..గంట‌న్న‌ర‌కే నెంబ‌ర్ 1 ర్యాంక్ గ‌ల్లంతు, రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ విక్ట‌రీ

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×