E-Paper
Advertisement

T20 World Cup 2026: ఐసీసీ ఓటింగ్ లో బంగ్లాదేశ్ కు బిగ్ షాక్‌..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లోకి కొత్త జ‌ట్టు?

T20 World Cup 2026:  ఐసీసీ ఓటింగ్ లో బంగ్లాదేశ్ కు బిగ్ షాక్‌..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లోకి కొత్త జ‌ట్టు?
Advertisement

T20 World Cup 2026:  ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 ( T20 World Cup 2026) టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ కు ( Bangladesh) ఊహించని షాక్ తగిలింది. ఈ టోర్నమెంట్ లో వేదికలు మార్చుతేనే ఆడతామని బంగ్లాదేశ్ పదే పదే చెప్పింది. అయితే దీనిపై తాజాగా ఓటింగ్ నిర్వహించిందట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC ). ఈ ఓటింగ్ లో కేవలం పాకిస్తాన్ మాత్రమే బంగ్లాదేశ్ కు ( Bangladesh) మద్దతు తెలిపింది. 14 ఓట్లు బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో బంగ్లాదేశ్ డిమాండ్లను పక్కకు పెట్టింది ఐసీసీ. ఆడితే ఆడండి… లేకపోతే వైదొలగండి అంటూ బంగ్లాదేశ్ కు వార్నింగ్ ఇచ్చిందట ఐసీసీ. ఒకవేళ బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ ఆడకపోతే స్కాట్లాండ్ ( Scotland) బరిలో ఉండనుంది. ఈ మేరకు ఐసీసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందట.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

ఐసీసీ ఓటింగ్ లో బంగ్లాదేశ్ కు బిగ్ షాక్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ కచ్చితంగా ఇండియాకు రావాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు సంచలన ప్రకటన కూడా చేసింది. శ్రీలంక లేదా పాకిస్తాన్ లాంటి తటస్థ వేదికల్లో ఆడదామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెబుతోంది… కానీ దానికి మేము అస్సలు ఒప్పుకోబోమని ఐసిసి వెల్లడించింది. తటస్థ వేదికల్లో బంగ్లాదేశ్ ఆడతామని చెప్పిన నేపథ్యంలో ఐసిసి ఓటింగ్ కూడా నిర్వహించింది. ఇందులో బంగ్లాదేశ్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఓటింగ్ లో 14-2 తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయిందని ఐసిసి స్పష్టం చేసింది.

అలాగే బంగ్లాదేశ్ జట్టుకు మరో 24 గంటల సమయం ఇస్తున్నట్లు ఐసిసి వెల్లడించింది. జనవరి 22వ తేదీ సాయంత్రం వరకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఆడడంపై క్లారిటీ ఇవ్వాలని ఈ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు మరోసారి డెడ్ లైన్ విధించింది ఐసిసి. తమ ప్రతిపాదనలకు నో చెబితే మరొక జట్టును తీసుకువస్తామని ఐసిసి క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ బంగ్లాదేశ్ ఈ టోర్నమెంటులో ఆడకపోతే పాయింట్లు ప్రకారం స్కాట్లాండ్ కు అవకాశం రానుంది. మరి దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

అస‌లు బంగ్లాదేశ్ వివాదం ఏంటి ?

Advertisement

బంగ్లాదేశ్ లో హిందువుల‌ను ఊచ‌కోత కోస్తున్నారు ముస్లింలు. వారంలో ఒక‌రు లేదా ముగ్గురిని హ‌త్య చేస్తున్నారు బంగ్లా ముస్లింలు. దీంతో ముస్తాఫిజుర్ రహామాన్‌ లాంటి ప్లేయ‌ర్లు ఐపీఎల్ 2026 లో ఆడ‌కుండా ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. దీంతో ఐపీఎల్ 2026 ప్ర‌సారాల‌పై బ్యాన్ విధించింది బంగ్లా స‌ర్కార్‌. అలాగే టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 లో భాగంగా ఇండియాలో ప‌ర్య‌టించ‌బోమ‌ని తెలిపింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( BCB). దీంతో ఈ వివాదం ముదిరింది.

Also Read: Shoaib Malik Retirement: పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ‌..PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×