E-Paper
Advertisement

Suryakumar Yadav: సికందర్ రాజాకు షేక్ హ్యాండ్‌…సూర్య కుమార్ పై బీసీసీఐ యాక్ష‌న్ !

Suryakumar Yadav: సికందర్ రాజాకు షేక్ హ్యాండ్‌…సూర్య కుమార్ పై బీసీసీఐ యాక్ష‌న్ !
Advertisement

Suryakumar Yadav:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) సూపర్ 8 దశలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చేసిన పని ఇప్పుడు వివాదంగా మారింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజాకు షేక్ హ్యాండ్ ఇవ్వడంపై దుమారం రేగుతోంది. సికందర్ రాజాకు ( Sikandar Raza) సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ( shaking hands ) ఎందుకు ఇచ్చాడని ఇండియన్ ఫ్యాన్స్ అటు పాకిస్తాన్ అభిమానులు ఇద్దరు కూడా సోషల్ మీడియాలో రెచ్చి పోతున్నారు. వెంటనే సూర్య కుమార్ యాదవ్ పై ( Suryakumar Yadav) భారత క్రికెట్ నియంత్రణ మండలి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా కూడా పాకిస్తాన్ వాడేన‌ని, అలాంటి వాడికి మీ సూర్య భాయ్ ఎందుకు షేక్ ఇచ్చాడ‌ని పాక్ నెటిజెన్స్ సీరియ‌స్ అవుతున్నారు. త‌మ పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డు కానీ, జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజాకు ఎలా ఇస్తార‌ని నిల‌దీస్తున్నారు. షేక్ హ్యండ్ విష‌యంలో బీసీసీఐ ( BCCI) ద్వంద్వ వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని నిప్పులు చెరుగుతున్నారు.

Also Read: India Semifinal Qualification Scenario: వెస్టిండీస్ తో జ‌రిగే మ్యాచ్ కు వ‌ర్షం గండం ? టీమిండియా సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతేనా !

సికందర్ రాజాకు షేక్ హ్యాండ్‌…సూర్య కుమార్ పై బీసీసీఐ యాక్ష‌న్ !

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా గురువారం రోజున ఇండియా వర్సెస్ జింబాబ్వ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా విక్టరీ అందుకుంది. జింబాబ్వేపై ఏకంగా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది సూర్య కుమార్ యాదవ్ సేన. అయితే జింబాబ్వే కెప్టెన్ గా ఉన్న సికందర్ రాజాకు సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వడంపై వివాదం రాజుకుంది. పాకిస్తాన్ లో పుట్టి పెరిగిన సికందర్ రాజాకు సూర్యకుమార్ యాదవ్ ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చిందని ఇండియన్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. వెంటనే అతనిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. అటు పాకిస్తాన్ అభిమానులు బీసీసీఐని ఉద్దేశించి వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు. బీసీసీఐ ఇది రెండు నాలుకల ధోరణి అంటూ పాకిస్తాన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.

సికందర్ రాజా నిజంగానే పాకిస్తాన్ కు చెందినవాడేనా ?

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా నిజంగానే పాకిస్తాన్ లో పుట్టి పెరిగాడు. కానీ జింబాబ్వేలో అతని ఫ్యామిలీ సెటిలైంది. 2002 సంవత్సరంలో పొట్టకూటి కోసం జింబాబ్వే వెళ్ళింది సికందర్ రాజా ఫ్యామిలీ. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే పౌరసత్వాన్ని దక్కించుకున్నాడు. 2013లో జింబాబ్వే క్రికెట్ జట్టులో చేరిపోయాడు సికందర్ రాజా. ఆ తర్వాత కెప్టెన్ గా కూడా ఎదిగాడు. ఈ లెక్కన సికందర్ రాజా పాకిస్తాన్లో పుట్టినా, జింబాబ్వేకి చెందిన వాడు అవుతాడు. అందుకే సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలాంటి వివాదం లేదా అని క్రీడా విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

Advertisement

Also Read: Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచ‌ల‌నం !

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×