E-Paper
Advertisement

Suryakumar Yadav : ముంబై మెరైన్ డ్రైవ్ బీచ్.. అమ్మాయితో సూర్య చిట్ చాట్

Suryakumar Yadav : ముంబై మెరైన్ డ్రైవ్ బీచ్.. అమ్మాయితో సూర్య చిట్ చాట్
Advertisement

Suryakumar Yadav : ఈ మాట నిజమే…టీమిండియా ప్లేయర్ మిస్టర్ 360…గ్రౌండ్ లో అన్నివైపులా విల్లులా శరీరాన్ని వంచుతూ బాల్ ని తిప్పికొడుతూ ఉంటాడు…అతనే సూర్య కుమార్ యాదవ్.. తనే అమ్మాయితో చిట్ చాట్ చేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..

మెరైన్ డ్రైవ్ రోడ్ లో ఒక కెమెరాతో వీడియోలు, ఫొటోలు తీస్తూ సూర్య కనిపించాడు. ఇంతకీ మెరైన్ డ్రైవ్ రోడ్ ఎక్కడ ఉందని అనుకుంటున్నారా? టీమ్ ఇండియా.. శ్రీలంకతో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ముంబయి వచ్చింది. అక్కడే మెరైన్ డ్రైవ్ రోడ్ ఉంది. అయితే అధికారికంగా దీని పేరు నేతాజీ సుభాస్ చంద్రబోస్ రోడ్డు అన్నమాట.

Advertisement

దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రోడ్ చుట్టూ అందమైన ఎత్తయిన భవనాలు, మరోవైపు అరేబియా సముద్రం ఉంటుంది. వీకెండ్స్ లో ముంబై వాసులు ఇక్కడికొచ్చి బీచ్ ని చూస్తూ, సముద్ర కెరటాల శబ్దాలను ఆస్వాదిస్తూ ఉంటారు. అందుకే ఈ బీచ్ రోడ్ సాయంత్రమైతే ఖాళీ ఉండదు.

ఈ ప్రత్యేకత తెలిసే అనుకుంటా.. ఖాళీ సమయం దొరికేసరికి సూర్య కెమెరామెన్ అవతారం ఎత్తాడు. ఈ మెరైన్ డ్రైవ్ రోడ్ కి వచ్చాడు. అయితే అందరూ గుర్తుపడితే ప్రమాదమని గ్రహించాడు. ముఖానికి మాస్క్ పెట్టాడు. నెత్తికి టోపి పెట్టాడు. కళ్లజోడు కూడా పెట్టాడు. మెడలో ఒక వీడియో కెమెరా వేసుకుని జనాల్లోకి వెళ్లిపోయాడు.

Advertisement

పబ్లిక్ ఇంటర్వ్యూలు తీసుకున్నాడు. ప్రపంచకప్ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ లు ఎలా సాగుతున్నాయి? ప్రజలెలా ఫీలవుతున్నారు? వారికి ఏ క్రికెటర్లు అంటే ఇష్టం? ఇలా ఒక క్రీడా విలేఖరిలా ప్రశ్నించాడు. చాలామంది ఇష్టమైన క్రికెటర్లు రోహిత్, కొహ్లీ పేర్లు చెప్పారు. అయితే ఒకమ్మాయి మాత్రం సూర్య ఆట అంటే ఎంతో ఇష్టం అని చెప్పింది. అతను మిస్టర్ 360.. వాంఖేడిలో ఒక అద్భుత ఇన్నింగ్స్ అతని నుంచి ఆశిస్తున్నానని చెప్పింది.

ఇంకేం.. ఆ మాట చెప్పగానే సూర్య మాస్క్ తీసేశాడు. ఆ అమ్మాయి ఒక్కసారి షాక్.. కెవ్వుమని కేక వేసింది. ఓమైగాడ్ అంటూ చేతులు ముఖానికి అడ్డు పెట్టుకుని ఆశ్చర్యపోయింది. ఇది కలా? నిజమా? అనుకునేలోపు ఆ అమ్మాయితో ఒక ఫోటో దిగి, సూర్య ఎంచక్కా హోటల్ కి వెళ్లిపోయాడు. అనంతరం బీసీసీఐ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.సూర్య హోటల్ కి చేరుకున్నాక, ఆ గెటప్ లో చూసి రవీంద్ర జడేజా కూడా గుర్తుపట్టలేకపోయాడు. సహచరులంతా కెమెరామెన్ సూర్య అంటూ కామెంట్లు చేశారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×