E-Paper
Advertisement

Surya Kumar Yadav : సూర్య కుమార్ యాదవ్‌కు మిగిలింది ఇంకా ఒక్కఛాన్స్ మాత్రమే

Surya Kumar Yadav : సూర్య కుమార్ యాదవ్‌కు మిగిలింది ఇంకా ఒక్కఛాన్స్ మాత్రమే
Advertisement
Surya Kumar Yadav

Surya Kumar Yadav : సూర్య కుమార్ యాదవ్ నుంచి ఇంత చెత్త ఆట ఎప్పుడూ చూడలేదు. కనీసం గ్రౌండ్‌లో నిలబడే ప్రయత్నమే చేయడం లేదు. ప్యాడ్స్ పెట్టుకునేంత సమయం కూడా క్రీజ్‌లో ఉండట్లేదు. దారుణమైన డకౌట్స్. మొన్న టెస్టుల్లో ఫెయిల్. నిన్న వన్డేల్లో ఫ్లాప్. ఇప్పుడు టీ20 మ్యాచుల్లోనూ దారుణమైన పర్ఫామెన్స్. బాల్స్ తిని స్ట్రైక్ రేట్ తక్కువైనా ఫర్వాలేదు.. కాసేపు బ్యాటింగ్ చేస్తే బాగుండు. కాని, జట్టుకు, అభిమానులకు ఆ హోప్ కూడా ఇవ్వడం లేదు.

స్కై అని, 360 డిగ్రీస్ ప్లేయర్ అని ముద్దుగా పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్.. ఇప్పుడు గోల్డెన్ డక్ ప్లేయర్ అని పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్2లో ఇరగదీస్తాడు అనుకుంటే.. ఆర్సీబీ మీద 16 బాల్స్‌కు 15 పరుగులు, సీఎస్కే మీద ఒకే ఒక్క పరుగు, మొన్నటి మ్యాచ్‌లో డక్ ఔట్. అసలు లాస్ట్ 6 మ్యాచెస్‌లో నాలుగు డకౌట్స్. ఇదీ సూర్య కుమార్ యాదవ్ ట్రాక్ రికార్డ్. ఇక ఆడతాడులే, జూలు విదుల్చుతాడులే అని ఎదురుచూస్తుంటే.. ఒకసారి వచ్చిపోమ్మా మెరుపుతీగ అన్నట్టే ఉంది సూర్య రాక, పోక.

Advertisement

సూర్య కుమార్ కుదురుకోడానికి ఒక్క మ్యాచ్ చాలు అంటున్నారు అభిమానులు. రవిశాస్త్రి సైతం ఇదే ఒపీయన్ వ్యక్తం చేశాడు. ఒక్క మ్యాచ్‌తో ఫామ్‌లోకి వస్తాడని, సూర్య అలాంటి ఆటగాడు అని అంటున్నారు. మరి ఫామ్‌లోకి వచ్చే మ్యాచ్ ఎప్పుడు? సోర్సెస్ ప్రకారం.. ఇంకొక్క మ్యాచ్‌లో మాత్రమే ఛాన్స్ ఇవ్వదలచుకుంది ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్. ఆ మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అయితే.. ఇక మొహమాటం లేకుండా పక్కప పెట్టేస్తారనే చెబుతున్నారు.

సూర్య కుమార్ యాదవ్‌ ముందున్న మరో డేంజర్.. వరల్డ్ కప్. ఈ ఐపీఎల్‌లో ఇలాగే పూర్ పర్ఫామెన్స్ చూపిస్తే.. వరల్డ్ కప్‌కు తీసుకోకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇండియాకు టాలెంటెడ్ ప్లేయర్స్ బోలెడు మంది ఉన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×