// // Sunil Gavaskar: నాటు నాటు సాంగ్ స్టెప్పులేసిన సునీల్ గవాస్కర్.. వీడియో వైరల్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Sunil Gavaskar: నాటు నాటు సాంగ్ స్టెప్పులేసిన సునీల్ గవాస్కర్.. వీడియో వైరల్

Sunil Gavaskar: నాటు నాటు సాంగ్ స్టెప్పులేసిన సునీల్ గవాస్కర్.. వీడియో వైరల్
Advertisement

Sunil Gavaskar: నాటు నాటు.. ఎక్కడికి వెళ్లినా ఇదే సాంగ్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో, టీవీల్లో రచ్చ రచ్చ చేస్తోంది. చివరికి క్రికెట్ స్టేడియంలో కూడా ఈ సాంగ్ దుమ్మురేపుతోంది. ఈ పాటకు క్రికెట్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా స్టెప్పులేసి క్రికెట్ స్టేడియంలో రచ్చ చేశారు.

సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ ఐదో రోజు మ్యచ్ ప్రారంభానికి ముందు గవాస్కర్ మీడియాతో మాట్లాడారు. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. తాను కూడా ఈ సినిమాను చూశానని.. ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు.

Advertisement

అలాగే నాటునాటు సాంగ్‌కు స్టెప్పులేసి అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘‘మన తెలుగు పాట నాటు నాటుకు ఆస్కార్ రావటం గర్వకారణం. ఈ అరుదైన సందర్భంపై లెజెండ్ సునీల్ గవాస్కర్, స్టార్ స్పోర్ట్స్ తెలుగు టీమ్ సంతోషాన్ని మీరు చూసేయండి’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×