E-Paper
Advertisement

Srilanka Beats Afganisthan : సెమీస్‌ రేసులో శ్రీలంక

Srilanka Beats Afganisthan : సెమీస్‌ రేసులో శ్రీలంక
Advertisement

T20 వరల్డ్ కప్ లో సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో… లంకేయులు జూలు విదిల్చారు. ఆప్ఘనిస్తాన్ పై 6 వికెట్ల తేడా గెలిచారు. ప్రస్తుతం 2 మ్యాచ్ లు ఓడి, రెండు మ్యాచ్ లు గెలిచి 4 పాయింట్లతో ఉన్న శ్రీలంక… ఇంగ్లండ్ పై గెలిస్తే సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆప్ఘనిస్తాన్… టాపార్డర్ బ్యాటర్లు ధాటిగా ఆడటంతో… మంచి రన్ రేట్ తో పరుగులు సాధిస్తూ వచ్చింది. గుర్బాజ్‌28, ఘనీ 22, ఇబ్రహీం 22, నజీబుల్లా 18 రన్స్ చేశారు. దాంతో… 14.1 ఓవర్లలో వంద పరుగుల మార్క్ అందుకుంది… ఆప్ఘన్. అయితే స్లాగ్ ఓవర్లలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. చివరి 5 ఓవర్లలో 40 రన్స్ మాత్రమే వచ్చాయి. దాంతో… 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 రన్స్ చేయగలిగింది… ఆప్ఘన్ టీమ్.

Advertisement

145 పరుగుల మోస్తరు లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక… రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వ కాస్త ధాటిగా ఆడటంతో… లంక లక్ష్యం దిశగా సాగింది. మెండిస్ 25 పరుగులు చేసి ఔటైనా… మిగతా బ్యాటర్లతో కలిసి ధనంజయ చివరిదాకా ఆడి జట్టును గెలిపించాడు. 42 బంతుల్లోనే 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 66 రన్స్ చేశాడు… ధనంజయ. మొత్తానికి 4 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది… శ్రీలంక. 3 వికెట్లు తీసిన లంక బౌలర్ హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×