E-Paper
Advertisement

Sri lanka Vs PCB: పాకిస్తాన్ కు శ్రీలంక వార్నింగ్‌..ఇండియాతో మ్యాచ్ ర‌ద్దుపై కొత్త వివాదం

Sri lanka Vs PCB: పాకిస్తాన్ కు శ్రీలంక వార్నింగ్‌..ఇండియాతో మ్యాచ్ ర‌ద్దుపై కొత్త వివాదం
Advertisement

Sri lanka Vs PCB:  టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఊహించని షాక్ ఇచ్చింది శ్రీలంక (Srilanka). ఇండియాతో ఫిబ్రవరి 15వ తేదీన జరగాల్సిన మ్యాచ్ ఆడాల్సిందేనని శ్రీలంక పట్టుబడుతోందట. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మ్యాచ్ షెడ్యూల్ అయింది. దీంతో శ్రీలంకలో చాలా హోటల్స్ అలాగే రూమ్స్ అన్ని బుక్ అయ్యాయి. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లేదని తెలియడంతో.. చాలా మంది క్యాన్సల్ చేసుకుంటున్నారట. దీంతో శ్రీలంక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా తో మ్యాచ్ ఆడాల్సిందేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు రిక్వెస్ట్ పెట్టిందట శ్రీలంక క్రికెట్ బోర్డు. మీ వల్ల నష్టపోతున్నామని వెల్లడించిందట.

Also Read:  Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు

పాకిస్తాన్ కు శ్రీలంక వార్నింగ్‌

Advertisement

T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ అనేక రకాల డ్రామాలు వాడుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నుంచి ముందుగా బంగ్లాదేశ్ బహిష్కరణ వేటుకు గురైన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ పైన సానుభూతి వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ కుట్రలకు తెర లేపింది. ఇలాంటి నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో తాము కూడా ఆడబోమని ముందుగా హింట్ ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే చివరి క్షణంలో తమ జట్టును శ్రీలంకలోని కొలంబోకు పంపించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

ఆస్ట్రేలియా అలాగే పాకిస్తాన్ రెండు జట్లు కూడా ఒకేసారి శ్రీలంకకు చేరుకున్నాయి. అయితే, శ్రీలంకకు చేరుకున్న తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాట మార్చింది. కొత్త డ్రామాలకు తెరదించింది. టోర్నమెంట్ పూర్తిగా ఆడతాం కానీ ఇండియాతో మ్యాచ్ మాత్రం ఆడబోమని వెల్లడిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీలంక చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియాతో పాకిస్తాన్ కచ్చితంగా ఆడాల్సిందేనని.. లేకపోతే శ్రీలంకకు సంబంధించిన టూరిస్ట్ బోర్డుకు నష్టం వాటిల్ల ప్రమాదం ఉందని శ్రీలంక ప్రభుత్వం మొత్తుకుంటోందట. ఇండియాతో కచ్చితంగా ఆడాలని రిక్వెస్ట్ చేస్తోందట శ్రీలంక. దీంతో పాకిస్తాన్ క‌క్క‌లేక‌, మింగ‌లేక చుక్క‌లు చూస్తోంది. అయితే, ఇండియాతో మ్యాచ్ ఆడ‌క‌పోతే, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగే ప్ర‌మాదం ఉంద‌ని స‌మాచారం.

Advertisement

Also Read:  Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×