E-Paper
Advertisement

Matthew Breetzke : సౌతాఫ్రికా స్టార్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ గా..

Matthew Breetzke : సౌతాఫ్రికా స్టార్ అరుదైన రికార్డు..  ప్రపంచంలోనే తొలి ప్లేయర్ గా..
Advertisement

Matthew Breetzke :  సౌతాఫ్రికా స్టార్ మాథ్యూ బ్రీట్జ్కే వన్డేల్లో పరుగుల ప్రవాహం కొనసాగిస్తున్నాడు. ఆడిన తొలి మూడు వన్డేల్లో అద్భుత రీతిలో చెలరేగిన ఈ కుడి చేతి వాటం బ్యాటర్.. తాజాగా ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్ లోను దుమ్ము లేపాడు. 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా కష్టాల్లో ఉన్నవేళ.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన బ్రీట్జ్కే ధనాధన్ దంచికొట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 78 బంతుల్లోనే 8ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. అయితే, నాథన్ ఎల్లిస్ ట్రాప్ లో పడిన బ్రీట్జ్కే.. వికెట్ కీపర్ అలెక్స్ క్వారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Also Read : Team India : స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్‌కు భారత్?

Advertisement

ప్రపంచ రికార్డు సాధించిన బ్రీట్జ్కే

ఏదేమైనా అద్భుత మెరుపు శతకంతో ఆకట్టుకున్న బ్రీట్జ్కే ఈ సందర్భంగా అరుదైన ప్రపంచ రికార్డును సాధించాడు. వన్డేల్లో ఆడిన తొలి నాలుగు మ్యాచ్ లలో 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు తొలి నాలుగు వన్డే ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు. ఇందుకు అతడికి ఐదు మ్యాచ్ లు అవసరమైతే.. బ్రీట్జ్కే మాత్రం నాలుగు వన్డేల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. కాగా 1987 ప్రపంచ కప్ సందర్భంగా సిద్ధు ఆస్ట్రేలియా మీద 73, న్యూజిలాండ్ మీద 75, ఆస్ట్రేలియా మీద 51, జింబాబ్వే మీద 55 పరుగులు సాధించాడు. అయితే, మధ్యలో మూడో వన్డేను అతడు మిస్ అయ్యాడు. మరోవైపు న్యూజిలాండ్ తో మ్యాచ్ సందర్భంగా 2025లో వన్డేల్లో అడుగుపెట్టిన 26 ఏళ్ల మాథ్యూ బ్రీట్జ్కే అరంగేట్రంలోనే భారీ సెంచరీ సాధించాడు. పాకిస్తాన్ వేదికగా జరిగిన ట్రై సిరీస్ లో కివీస్ జట్టుతో మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి 148 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. తద్వారా వన్డే అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

Advertisement

బ్రీట్జ్కే రికార్డు ఇన్నింగ్స్.. 

అనంతరం పాకిస్తాన్ తో వన్డేల్లో 83 పరుగులు చేశాడు బ్రీట్జ్కే.  తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే తొలి మ్యాచ్ 57 పరుగులు సాధించిన బ్రీట్జ్కే రెండో వన్డేల్లో 88 పరుగులు చేశాడు. తద్వారా ఆడిన తొలి నాలుగు వన్డేల్లో 96.67 సగటుతో 378 పరుగులు సాధించాడు బ్రీట్జ్కే. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (8), కెప్టెన్ మార్క్రమ్ (0) విఫలం కాగా.. వన్ డౌన్ బ్యాటర్ టోనీ డి జోర్జీ (38) పర్వాలేదనిపించాడు. మాథ్యూ బ్రీట్జ్కే (88) టాప్ రన్ స్కోరర్ గా నిలవగా.. ట్రీస్టన్ స్టబ్స్ (74) కూడా రానిచ్చాడు. మిగిలిన వారిలో వియాన్ ముల్ధర్ 26, కేశవ్ మహారాజ్ 22 పర్వాలేదనిపించారు. ఇక ఆసిస్ బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు తీయగా.. జేవియర్ బర్ట్ లెట్, మార్నస్ లబుషేన్, నాథన్ ఎల్లిస్, రెండేసి వికెట్లు కూల్చారు. జోష్ హాజిల్ వుడ్ కు ఒక వికెట్ దక్కింది. టీ20, మూడు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన సౌతాఫ్రికా.. టీ20 సిరీస్ లో ఆఫీస్ చేతిలో 2-1తేడాతో ఓడిపోయింది. కానీ తాజాగా వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×