E-Paper
Advertisement

SA vs NZ 1st Semi-Final: ఇవాళే మొద‌టి సెమీస్‌..వ‌ర్షం ప‌డితే ఎలా, రిజ‌ర్వ్ డే ఉంటుందా ? న్యూజిలాండ్ కు వెన్నులో వ‌ణుకు

SA vs NZ 1st Semi-Final: ఇవాళే మొద‌టి సెమీస్‌..వ‌ర్షం ప‌డితే ఎలా, రిజ‌ర్వ్ డే ఉంటుందా ? న్యూజిలాండ్ కు వెన్నులో వ‌ణుకు
Advertisement

SA vs NZ 1st Semi-Final: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) తుది దశకు వచ్చేసింది. ఇందులో భాగంగానే సెమీ ఫైనల్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ ( South Africa vs New Zealand) మధ్య మొట్ట మొదటి సెమీ ఫైనల్ ఇవాళ సాయంత్రం జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens, Kolkata ) వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 7:00 సమయంలో మ్యాచ్ ప్రారంభం కానుండగా… ఆరున్నరకు టాస్ వేస్తారు. ఇక దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ‌ధ్య మ్యాచ్ జియో హాట్ స్టార్‌, స్టార్ స్పోర్ట్స్ వేదిక‌గా ఫ్రీగానే చూడ‌వ‌చ్చును.

Also Read : BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా

దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం పడితే ఎలా ?

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం పడే అవకాశాలు లేనట్లే అని వాతావరణ శాఖ చెబుతోంది. కానీ 10 నుంచి 20% వరకు వర్ష సూచన ఉన్నట్లు కూడా అంచనాలు వేస్తోంది వాతావరణ శాఖ. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ వర్షం పడితే.. రిజర్వుడే ఈ మ్యాచ్ కు ఉంటుంది. అంటే ఈ లెక్కన మార్చి 5వ తేదీన కూడా ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచి షురూ కానుంది. ఇక రిజర్వుడే రోజు కూడా మ్యాచ్ జరగకపోతే సూపర్ 8 లో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఫైనల్ కు దూసుకు వెళ్తుంది. న్యూజిలాండ్ ఇంటి దారి పడుతుంది. ఇక న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టి20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు జరిగాయి. ఈ ఐదు మ్యాచ్లలో కూడా దక్షిణాఫ్రికా గెలవడం గమనార్హం. ఇటీవ‌ల కూడా న్యూజిలాండ్ ను దక్షిణాఫ్రికా ఓడించింది. దీంతో అడ్వాంటేజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు

 

దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ జ‌ట్ల అంచ‌నా

Advertisement

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి engidi

న్యూజిలాండ్ ప్రాబబుల్ XI: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్ ), కోల్ మెక్కాంచీ/జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ/జాకబ్ డఫీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్

Also Read: Ban On Sanju Samson: సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్, ఆ హెల్మెటే కొంప‌ముంచిందా ? ( T20 World Cup 2026 tournament )

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×