E-Paper
Advertisement

Sourav Ganguly : గంభీర్ పెద్ద‌ మెంటలోడు…ష‌మీని అన్ని ఫార్మాట్లలో ఆడించాల్సిందే

Sourav Ganguly : గంభీర్ పెద్ద‌ మెంటలోడు…ష‌మీని అన్ని ఫార్మాట్లలో ఆడించాల్సిందే
Advertisement

Sourav Ganguly : టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పేస‌ర్ గా త‌న స‌త్తా చాటుతున్నాడు. అయితే కేవ‌లం వ‌న్డేలు, టెస్టుల‌కు మాత్ర‌మే ఎంపిక అవుతున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన టెస్టు, వ‌న్డే మ్యాచ్ ల‌కు ఎంపిక కాలేదు. ఈ నేప‌థ్యంలో మాజీ కెప్టెన్ సౌర‌బ్ గంగూలీ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ అన్ని పార్మాట్ల‌లో ఆడాల‌ని తెలిపాడు. యూకేకి చెందిన కబుని అనే ఏఐ క్రీడా శిక్షణ వేదికకు గంగూలీ బ్రాడ్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రామ్‌లో సౌరభ్ మాట్లాడుతూ..‘రంజీ ట్రోఫీలో షమి బౌలింగ్‌ చూశాను. అతడు ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. అదే విధంగా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఒంటిచేత్తో బెంగాల్‌ జట్టు(Bengal Cricket Team)ను గెలిపించాడు.

Also Read : Shubman Gill: సారాను న‌మ్మించి మోసం చేసిన గిల్‌… టీమిండియా లేడీ ప్లేయర్ తో రొమాన్స్…!

రంజీల్లో అద్భుత‌మైన ఫామ్..

Advertisement

రెండు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనను బీసీసీఐ సెలక్టర్లు చూశారనే అనుకుంటున్నాను. వాళ్లు షమితో మాట్లాడుతూనే ఉంటారని భావిస్తున్నా. ప్రస్తుతం షమి(Mohammed Shami) ఉన్న ఫామ్, ఫిట్‌నెస్‌ చూస్తే టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో ఆడగలడని నేను నమ్మతున్నాను. ఇంత ఫిట్ గా ఉన్న షమిని టెస్టుల్లో ఎందుకు తీసుకోవడం లేదో అర్ధం కావట్లేదు’ అని సౌరభ్‌ పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో జరిగే టెస్టులకు షమి సెలెక్ట్ కానీ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గంగూలి పరోక్షంగా బీసీసీఐ(BCCI) సెలెక్టర్లకు ఈ కీలక సూచనలు చేశాడని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే యంగ్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ గురించి కూడా దాదా ప్రస్తావించాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ధ్రువ్‌ జురెల్‌ తుది జట్టులో ఉండాలని ఆయన అన్నాడు. వికెట్ కీపర్ అయినప్పటికీ బ్యాటింగ్ ప్రదర్శన ఆధారంగా అతడు తుది జట్టులో చోటు సంపాదిస్తాడని గంగూలి ఆశాభావం వ్యక్తం చేశాడు.

జురెల్ ఇన్నింగ్స్ అదుర్స్..

జురెల్‌ బాగా ఆడుతున్నాడని, గాయం నుంచి కోలుకున్న రిషబ్‌ పంత్‌ కూడా పునరాగమనానికి సిద్ధమయ్యాడని అన్నాడు. పంత్ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆడడం ఖాయమని, అయితే ఫామ్‌లో ఉన్న జురెల్‌కు కూడా అవకాశాన్ని కల్పించాలని సెలెక్టర్లకు గంగూలీ సూచించాడు. సాయి సుదర్శన్‌ను తప్పించి ఆ స్థానంలో జురెల్‌ను ఆడించడమే మార్గంగా కనిపిస్తోందని గంగూలీ అన్నాడు. తాజాగా దక్షిణాఫ్రికా-ఎతో రెండో అనధికార టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో జురెల్‌ అదరగొట్టిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా ష‌మీ గురించి ప‌రిశీలించిన‌ట్ట‌యితే దేశ‌వాళీ టోర్నీల‌లో స‌త్తా చాటుతున్న భార‌త బౌల‌ర్ ష‌మీకి సౌర‌బ్ గంగూలీ మ‌ద్ద‌తుగా నిలిచాడు. రంజీల్లో ప్ర‌ద‌ర్శ‌న చూస్తూ ఆయ‌న చాలా ఫిట్ గా క‌నిపిస్తున్నాడ‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. ష‌మీ టీమిండియా కి అన్ని ఫార్మాట్ల‌లో ఆడాల‌ని దాదా కోరారు. అపార‌మైన ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ జాతీయ జ‌ట్టుకు ఎందుకు సెలెక్ట్ అవ్వ‌డం లేదో అర్థం కావ‌డం లేద‌న్నారు. ఈ సీజ‌న్ లో వెస్ట్ బెంగాల్ త‌ర‌పున 2 రంజీ మ్యాచ్ ల్లో ష‌మీ 15 వికెట్లు తీయ‌డం విశేషం.

Advertisement

Also Read : Arshdeep Singh: రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్..మైలేజ్‌, ఫీచ‌ర్స్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×