E-Paper
Advertisement

Sanju Samson : పాపం శాంసన్.. ఏంటీ దురదృష్టం ఇలా వెంటాడుతోంది?

Sanju Samson : పాపం శాంసన్.. ఏంటీ దురదృష్టం ఇలా వెంటాడుతోంది?
Advertisement
Sanju Samson

Sanju Samson : సంజూ శాంసన్. చిన్న వయసులోనే క్రికెట్‌లో అడుగుపెట్టి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతటి వాడు అని మొదట్లో అందరూ పొగిడేలా ఆడాడు. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌లలో చెలరేగిపోయాడు. సంజూ శాంసన్ ఆట చూసి వన్డేల్లో అవకాశం ఇచ్చినా.. దాన్ని ఉపయోగించుకున్నది తక్కువే. మిగతా ఆటగాళ్లకు ఇచ్చినన్ని అవకాశాలు.. పాపం సంజూ శాంసన్‌కు దక్కలేదనే చెప్పాలి. అందుకే, ఐపీఎల్‌లోనే ఎక్కువ సత్తా చాటుతున్నాడు. ఆ ఆట, టాలెంట్ చూసే ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌ను కొంటున్నాయి మేనేజ్‌మెంట్స్.

ఎందుకనో సంజూ శాంసన్‌కు కాలం కలిసి రావడం లేదు. వరుస పెట్టి డకౌట్స్ అవుతున్నాడు. లాస్ట్ 2 మ్యాచ్‌లలో అయితే పూర్తిగా ట్రాక్ తప్పినట్టు కనిపిస్తున్నాడు. సూర్య కుమార్ యాదవ్ లాంటి వాళ్లే ట్రాక్ తప్పుతున్నప్పడు సంజూ శాంసన్ ఎంత అంటారా. సూర్యకు ఐపీఎల్ కాకపోతే వన్డే, టెస్టుల్లో అవకాశ వస్తుంటుంది. కాని, శాంసన్ విషయంలో అలా కాదు. ఐపీఎల్‌లో మెరవాల్సిందే.

Advertisement

పైగా సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ కూడా. ఆడిన మ్యాచుల్లో వరుసగా రెండుసార్లు డకౌట్ అవడం.. రియల్లీ నాట్ గుడ్ ఫర్ కెరీర్. బుధవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో శాంసన్.. జడేజా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్తాన్‌ రాయల్స్ జట్టు తరపున ఎక్కువ సార్లు డకౌట్‌ అయిన ఆటగాడిగా శాంసన్‌ నిలిచాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో ఔట్ అవడంతో.. 8 సార్లు డకౌట్‌ అయ్యాడు సంజూ శాంసన్.

శాంసన్‌ తర్వాత షేన్‌ వార్న్‌, స్టువర్ట్‌ బిన్నీ ఏడుసార్లు డకౌట్ అయి సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. అజింక్యా రహానే ఐదుసార్లు డకౌట్ అయి మూడో స్థానంలో ఉన్నాడు. ఇదంతా చూస్తున్న అభిమానులు… ఇలాంటి రికార్డులు అవసరమా సంజూ అని కామెంట్ చేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×