E-Paper
Advertisement

Snooker: పాకిస్థాన్ స్నూకర్ ప్లేయర్ ఆత్మహత్య.. అదే కారణం..

Snooker: పాకిస్థాన్ స్నూకర్ ప్లేయర్ ఆత్మహత్య.. అదే కారణం..
Advertisement

Snooker: ఈరోజుల్లో మానసిక వ్యాధులు తీవ్రంగా ఎక్కువయిపోతున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిప్రెషన్ అనేది మనుషుల ప్రాణాలను తీసేస్తోంది. డబ్బు, ఫేమ్ అనేవి ఏవి డిప్రెషన్ నుండి మనుషులను కాపాడలేకపోతున్నాయి. ముఖ్యంగా యూత్.. డిప్రెషన్ వల్ల ప్రాణాలను తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఫేమస్ ఆటగాడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి కారణం డిప్రెషనే అని అందరూ అనుమానిస్తున్నారు.

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ స్నూకర్ ప్లేయర్ మహమ్మద్ మజీద్ అలీ వయసు 28 ఏళ్లే. ఈద్ ఉల్ అధా రోజున అలీ ఆత్మహత్య చేసుకున్నాడు. తను చాలాకాలంగా డిప్రెషన్‌తో పోరాడుతున్నాడని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గత నెలలోనే ప్రముఖ స్నూకర్ ప్లేయర్ మహమ్మద్ బిలాల్ గుండెపోటుతో మరణించాడు. నెల రోజులలోనే ఇలా మరో స్నూకర్ ప్లేయర్ మరణించడం చాలా బాధాకరంగా ఉందంటూ పాకిస్థాన్ బిలియార్డ్స్ అండ్ స్నూకర్ అసోసియేషన్ (పీబీఎస్ఏ) వాపోయింది.

Advertisement

మహమ్మద్ మజీద్ అలీ మంచి స్నూకర్ ప్లేయర్, అతడు పాకిస్థాన్‌కు ఎంతో గుర్తింపును, మెడల్స్‌ను తీసుకొస్తాడని భావించామని తోటి ప్లేయర్స్ చెప్తున్నారు. అలీ.. తన సొంతూరు సుముంద్రీలో చెక్కను కట్ చేసే మెషీన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలీ సోదరుడు ఉమర్ కూడా తన సోదరిడిది ఆత్మహత్య అనే నిర్ధారించాడు. గత కొన్నేళ్లుగా అలీ డిప్రెషన్‌లో ఉన్నాడని, దానికి గల కారణం తెలియదని బయటపెట్టాడు. అంతే కాకుండా వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవన్నాడు.

డిప్రెషన్‌లో ఉన్నా కూడా ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదంటూ ఉమర్ బాధపడ్డాడు. ఏషియన్ యూ21 ఛాంపియన్‌షిప్‌లో మజీద్ అలీ సిల్వర్ మెడల్‌ను గెలుచుకుని తన దేశం గర్వపడేలా చేశాడు. అలీ మరణానికి పీబీఎస్ఏ ఛైర్మన్‌తో పాటు తోటి ప్లేయర్స్ కూడా సంతాపం తెలియజేశారు. మహ్మమద్ యూసఫ్, మహమ్మద్ అసీఫ్ లాంటి ఆటగాళ్ల వల్ల పాకిస్థాన్‌లో స్నూకర్‌కు చాలా పాపులారిటీ దక్కింది. మజీద్ అలీ కూడా వారి స్థాయికి చేరుకుంటాడని అందరూ భావించారు. కానీ తన జీవితం ఇలా అర్థాంతరంగా ఆగిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు తోటి ప్లేయర్స్ దు:ఖంలో మునిగిపోయారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×