E-Paper
Advertisement

Smriti Mandhana Wedding : పలాష్ ముచ్చల్ జాత‌కంలో దోషం..స్మృతి తండ్రి ప్రాణాల‌కే ముప్పు ఉందా ?

Smriti Mandhana Wedding : పలాష్ ముచ్చల్ జాత‌కంలో దోషం..స్మృతి తండ్రి ప్రాణాల‌కే ముప్పు ఉందా ?
Advertisement

Smriti Mandhana Wedding : టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా ప‌డింది. ప్రియుడు మ్యూజిక్ కంపోజ‌ర్ ప‌లాశ్ ముచ్చ‌ల్ తో మ‌హారాష్ట్ర సాంగ్లిలో ఇవాళ వేడుక జ‌ర‌గాల్సి ఉంది. కానీ ఆమె తండ్రి శ్రీనివాస్ కి ఈ ఉద‌యం హార్ట్ ఎటాక్ రావ‌డంతో నిర‌వ‌ధికంగా వివాహం వాయిదా వేసుకున్న‌ట్టు ఆమె మేనేజ‌ర్ తుహిన్ మిశ్రా ప్ర‌క‌టించారు. ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డ్డాకే స్మృతి పెళ్లి చేసుకుంటార‌ని వెల్ల‌డించారు. వాస్త‌వానికి మ‌హారాష్ట్ర‌లోని సంగ్లీలో స్మృతి వివాహ జ‌ర‌గాల్సి ఉంది. కానీ పెళ్లి జ‌ర‌గ‌డానికి కొద్ది క్ష‌ణాల స‌మ‌యం ఉంద‌న‌గానే శ్రీనివాస్ కి అలా జ‌ర‌గ‌డంతో వాయిదా ప‌డింది.

Also Read : PAK vs ZIM, HAT-TRICK: మిస్టరీ స్పిన్న‌ర్‌ ఉస్మాన్ తారిక్ హ్యాట్రిక్ ..జింబాబ్వేపై పాకిస్తాన్ విజయం

షాక్ లో స్మృతి మంధాన‌..!

Advertisement

దీంతో ఒక్క‌సారిగా అంద‌రూ పెళ్లి మండ‌పంలో ఉలిక్కి ప‌డ్డారు. వెంట‌నే స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆమె తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యం కుదుట‌ప‌డిన త‌రువాత స్మృతి మంధాన వివాహం ఉంటుంద‌ని.. త్వ‌ర‌లోనే పెళ్లి తేదీని మ‌ళ్లీ ప్ర‌క‌టిస్తామ‌ని ఆయ‌న వివ‌రించారు. శుభ‌కార్యం జ‌ర‌గాల్సిన వేళ ఇలా జ‌ర‌గ‌డం ఏంటి..? అని అంద‌రూ చ‌ర్చించుకోవ‌డం విశేషం. అయ్యో పాపం స్మృతి మంధాన అంటూ మ‌రికొంద‌రూ అయితే ఎమోష‌నల్ అవుతూ సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇటీవ‌లే భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకొని రికార్డు సృష్టించింది. ఆ విజ‌యంలో మునిగి తేలిన కొద్ది రోజుల‌కే టీమిండియా ఓపెన‌ర్ స్మృతి మంధాన పెళ్లి. ప‌లాష్ ముచ్చ‌ల్ తో గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా డేటింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ పెళ్లికి త‌న స‌హ‌చ‌ర క్రికెట‌ర్లూ కూడా హాజ‌ర‌య్యారు. వారితో క‌లిసి పెళ్లి వేడుక‌ల్లో స్మృతి చేసిన సంద‌డి మామూలు కాదు.

పలాష్ ముచ్చల్ జాత‌కంలో దోషం ఉందా..?

ముఖ్యంగా హ‌ల్దీ, మెహందీ, సంగీత్.. ఇలా ర‌క‌ర‌కాల వేడుక‌ల్లో వీరి ఉత్సాహం మామూలుగా లేదు. మ‌రి కొన్ని గంటల్లో న‌చ్చిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నందుకు స్మృతి ఎంత సంతోషించి ఉంటుందో.. కానీ అంత‌లో హ‌ఠాత్ ప‌రిణామం చోటు చేసుకోవ‌డంతో పెళ్లి నిలిపివేయాల్సి వ‌చ్చింది. పెళ్లికి వ‌చ్చిన వారికి కోపం.. పెల్లి చేసుకోవ‌డం లేద‌ని స్మృతికి బాధ‌, మ‌రోవైపు తన‌తండ్రికి ఇలా కావ‌డం ఏంటి..? అని మ‌రోవైపు ఆశ్చ‌ర్యం ఇలా అన్ని విధాలుగా చ‌ర్చ‌లు ప్రారంభం అయ్యాయి. అయితే మ‌రోవైపు ప‌లాష్ జాత‌కం బాగోలేద‌ని.. అందుకే ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా శ‌నివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్‌లో స్మృతి, ముచ్చల్‌ల జంట డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఇందులో జెమీమా రోడ్రిగ్స్, రాధ యాద‌వ్, అరుంధ‌తి రెడ్డి స‌హా ప‌లువురు భార‌త క్రికెట‌ర్లు సంద‌డి చేశారు. వీరి డ్యాన్స్ వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఐతే ఆదివారం ఉద‌యం అంద‌రూ పెళ్లి కోసం సిద్ధ‌మ‌వుతుండ‌గా ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

Advertisement

Also Read : Indian Women Blind Team: రోహిత్ శ‌ర్మను కాపీ కొట్టిన‌ అంధుల టీమిండియా..వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌కు ఫ్రైజ్ మనీ ఎంతంటే

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×