E-Paper
Advertisement

Smriti Mandhana Wedding: పలాష్ కు మరో అమ్మాయితో ఎఫైర్.. పెళ్ళి ఆపేందుకే స్మృతి తండ్రి గుండెపోటు డ్రామాలు?

Smriti Mandhana Wedding: పలాష్ కు మరో అమ్మాయితో ఎఫైర్.. పెళ్ళి ఆపేందుకే స్మృతి తండ్రి గుండెపోటు డ్రామాలు?
Advertisement

Smriti Mandhana Wedding: టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన పెళ్లి ( Smriti Mandhana Wedding ) గురించి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. నవంబర్ 23వ తేదీ అంటే ఆదివారం రోజున స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం జరిగేది. కానీ, పెళ్లి పీటలపైన వాళ్ళిద్దరి పెళ్లి ఆగిపోయింది. మరికాసేపట్లోనే మూడు ముళ్ళు స్మృతి మందాన మెడలో పడేవి. కానీ అంతలోనే ట్విస్ట్ నెలకొంది. సినిమా రేంజ్ లో అంబులెన్స్ రావడం, స్మృతి మందాన ( Smriti Mandhana) తండ్రిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అప్పటి వరకు తీన్మార్ స్టెప్పులతో డ్యాన్సులు చేసిన స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ గుండెపోటు అంటూ అక్కడ రచ్చ రచ్చ చేశాడు. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

తండ్రికి గుండెపోటు… స్మృతి మందాన పెళ్లి రద్దు?

Advertisement

తన తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు రావడంతో స్మృతి మందాన పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఫ్యామిలీ మొత్తం ఆసుపత్రికి వెళ్లడంతో పెళ్లి పీటలపైనే స్మృతి వివాహం ఆగిపోయింది. ఇప్పటికి కూడా ఆసుపత్రిలోనే స్మృతి మందాన కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా నిన్న జరగగా, ఇవాళ స్మృతి మందానకు కాబోయే భర్త పలాష్‌ ముచ్చల్ కు తీవ్ర అస్వస్థత నెలకొందట. గ్యాస్ ట్రబుల్, వైరల్ ఫీవర్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో పలాష్ ముచ్చ‌ల్ కూడా ఆసుపత్రి పాలయ్యాడట. ఈ న్యూస్ ఇవాళ ఉదయం నుంచి వైరల్ గా మారింది.

పెళ్లి ఆపేందుకు స్మృతి మందాన తండ్రి డ్రామాలు?

స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ కు నిజంగా గుండెపోటు రాలేదని, పలాష్ ముచ్చల్ తో వివాహాన్ని ఆపేందుకు ఇలా డ్రామాలు ఆడినట్లు ఇప్పుడు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హల్ది ఫంక్షన్ రోజు పలాష్ ముచ్చల్ బాగోతం స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ కు తెలిసిందట. మరో మహిళతో పలాష్ ముచ్చల్ కు ఎఫైర్ ఉన్నట్లు శ్రీనివాస్ కు ఆధారాలు దొరికినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో పెళ్లి ఆపలేడు కాబట్టి, గుండెపోటు డ్రామాలు ఆడేట శ్రీనివాస్. అందుకే సరిగ్గా తాళిబొట్టు కట్టే, సమయంలో అంబులెన్స్ ఎంట్రీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఆసుపత్రికి వెళ్లిన తర్వాత స్మృతి మందానకు అసలు విషయం చెప్పాడట శ్రీనివాస్. ఇక తండ్రి చెప్పిన మాటలు విన్న స్మృతి మందాన, పెళ్లి రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇందులో భాగంగానే హల్దీ ఫంక్షన్, పెళ్లికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసిందట. నిన్నటి వరకు ఆమె ఇనిస్టా లో పెళ్లికి సంబంధించిన ఫోటోలు, స్టేడియంలో పలాష్‌ ముచ్చల్ ప్రపోజ్ చేసిన వీడియో అన్ని కనిపించాయి. కానీ ఇవాళ ఉదయం నుంచి అవి కనిపించడం లేదు. సోషల్ మీడియాలో ఆమె డిలీట్ చేసినట్లు చెబుతున్నారు. పలాష్ ( Palash Muchhal) నిజస్వరూపం బయటపడడంతో స్మృతి మందాన ఈ నిర్ణయం తీసుకున్నారట. పెళ్లి కూడా క్యాన్సల్ అని చెప్పేశారట. ఈ దెబ్బకే పలాష్ ముచ్చల్ కు వైరల్ ఫీవర్ వచ్చి ఆసుపత్రిపాలయ్యాడని తెలుస్తోంది.

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×