E-Paper
Advertisement

MI VS GT: రోహిత్ శర్మ క్లీన్-బౌల్డ్.. ర్యాగింగ్ చేసిన సిరాజ్…!

MI VS GT: రోహిత్ శర్మ క్లీన్-బౌల్డ్.. ర్యాగింగ్ చేసిన సిరాజ్…!
Advertisement

MI VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య 9వ మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. 8 పరుగులకే అవుట్ అయిన రోహిత్ శర్మ.. తన అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. అయితే… రోహిత్ శర్మ నార్మల్గా అవుట్ అయితే పర్వాలేదు. కానీ గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగు బంతుల్లో 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి దొరికిపోయాడు.

Also Read: Sehwag on MS Dhoni: స్టంపింగ్ చేయడంలో ధోనిని కొట్టేవాడు లేడు.. ఫిదా అయిపోయిన సెహ్వాగ్

Advertisement

రోహిత్ శర్మ బ్యాట్ టచ్ చేసే లోపే… బాల్ వికెట్లను తగిలేసింది. దీంతో ఆ వికెట్ చూసిన క్రీడా అభిమానులు అందరూ… షాక్ అయ్యారు. అటు రోహిత్ శర్మ కూడా దిమ్మ తిరిగిపోయినట్లుగా చూస్తూ… పెవిలియన్ దారిపట్టాడు. అయితే రోహిత్ శర్మ వికెట్ తీసిన తర్వాత మహమ్మద్ సిరాజ్… సెలబ్రేషన్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఏదో వరల్డ్ కప్ సాధించిన రేంజ్ లో మహమ్మద్ సిరాజ్… ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడింది టీమిండియా. ఆ సమయంలో మహమ్మద్ సిరాజుకు చాన్సు రాలేదు. దీనిపై రోహిత్ శర్మ మాట్లాడారు.

Also Read: Csk fans: చెన్నై కెప్టెన్ రుతురాజుపై దారుణంగా ట్రోలింగ్… చెత్త నిర్ణయాలు అంటూ!

Advertisement

మహమ్మద్ సిరాజ్ పెద్దగా బౌలింగ్ చేయడం.. అతని దగ్గర సత్తా తక్కువ ఉంది అన్న రేంజిలో… సమాధానమిచ్చాడు రోహిత్ శర్మ. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ వికెట్.. మహమ్మద్ సిరాజ్ తీయడంతో… సిరాజ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్లకు తన బంతితో సమాధానం మహమ్మద్ సిరాజ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి రోహిత్ శర్మ వికెట్ను ( Rohit Sharma) మహమ్మద్ సిరాజ్ తీయడం హాట్ టాపిక్ అయింది. రోహిత్ శర్మ వికెట్ తో పాటు రైన్ రికల్టన్ వికెట్ కూడా తీశాడు మహమ్మద్ సిరాజ్. దీంతో ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది.

తిలక్ వర్మ కూడా 36 బంతులో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా అలాగే సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ తరుణంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన గుజరాత్ టైటాన్స్…. 176 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఒక్కడే 41 బంతుల్లో 63 పరుగులు చేసి దుమ్ము లేపాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×