E-Paper
Advertisement

Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి,  లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!
Advertisement

Shubman Gill: బుధవారం రోజు లక్నో వేదికగా భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగవ టి-20 టాస్ పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. పొగ మంచు కారణంగా మ్యాచ్ మొదలుకాకుండానే ముగిసిపోయింది. సాయంత్రం 6:30 గంటలకు పడాల్సిన టాస్.. పొగ మంచు కారణంగా పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. పొగ మంచు దుప్పటిలా కప్పి వేయడంతో విజిబులిటీ తీవ్రంగా తగ్గిపోయింది.

Also Read: LIONEL MESSI: క్రైస్తవుడైన మెస్సీతో శివనామ స్మరణం చేయించిన అంబానీ.. ఇదిరా ఇండియా అంటే ?

Advertisement

దీంతో పలుమార్లు మైదానానికి వచ్చిన అంపైర్లు.. మైదానాన్ని పర్యవేక్షిస్తూ వెళ్ళిపోయారు. 6:50 నిమిషాలకు ఒకసారి, 7:30 నిమిషాలకు మరొకసారి, 8 గంటలకు మరొకసారి, చివరగా 8:30 నిమిషాలకు మరొకసారి మైదానంలోకి వచ్చిన అంపైర్లు పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత 9 గంటలకు, 9:25 నిమిషాలకు మరొకసారి రివ్యూ చేశారు. కానీ పొగ మంచు అలాగే ఉండడంతో మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

 

గాయం కారణంగా చివరి మ్యాచ్ కి గిల్ దూరం:

Advertisement

సౌత్ ఆఫ్రికాతో నాలుగవ టి-20 కి ముందు గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు భారత వైస్ కెప్టెన్ గిల్. మొదటి మూడు మ్యాచ్ లలో గిల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మొదటి మ్యాచ్ లో 4 పరుగులు, రెండవ మ్యాచ్ లో డకౌట్, మూడవ టి-20 లో 28 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేశాడు. ఇక నాలుగవ టి-20 కోసం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గిల్ కాలి బొటనవేలికి గాయమైంది. ఈ కారణంగా లక్నోలో రద్దయిన మ్యాచ్ తో పాటు అహ్మదాబాద్ లో జరగబోతున్న చివరి టీ-20 మ్యాచ్ కి కూడా గిల్ అందుబాటులో ఉండడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

 

లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపిన గిల్:

నాలుగవ టి-20కి ముందు గిల్ జట్టులో లేకపోవడంతో సంజూ శాంసన్ కి ఎట్టకేలకు అవకాశం దొరికింది. కానీ ఆ ఆనందం అతడికి కాసేపు కూడా మిగలలేదు. ఛాన్స్ వచ్చినప్పటికీ ప్రకృతి సహకరించకపోవడంతో లక్నో వేదికగా జరగాల్సిన నాలుగవ టి-20 పొగ మంచు కారణంగా రద్దయింది. మరోవైపు ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో కూడా గిల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా గిల్ ని ట్రోల్ చేస్తున్నారు క్రీడాభిమానులు.

Also Read: Yashasvi Jaiswal: మ్యాచ్ ఆడుతుండగా కలకలం.. ఆసుపత్రిలో చేరిన జైస్వాల్.. అసలు ఏమైంది అంటే

తాను ఆడకపోతే మ్యాచ్ రద్దు కావాలని.. కావాలనే గిల్ లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపించాడని ట్రోల్ చేస్తున్నారు. గాయం కారణంగా గిల్ నాలుగోవ టి-20 మ్యాచ్ కి దూరమవుతున్నాడని టీమిండియా ముందుగానే ప్రకటించింది. దీంతో తాను ఆడని మ్యాచ్లో మరెవరు ఆడకూడదని గిల్ కుట్రలు చేశాడని, బయట నుంచి పొగ మంచు పంపించాడని పలు వీడియోలను ఉపయోగించి గిల్ ని ట్రోల్ చేస్తున్నారు. దీంతో గిల్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×